ఛత్రపతిని తెలుగుకు దూరం పెట్టారు

ఛత్రపతి సినిమా…రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ ..సూపర్ డూపర్ హిట్. అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వివి వినాయక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి. మే 12న విడుదల కానీ…కేవలం హిందీలో మాత్రమే.…

ఛత్రపతి సినిమా…రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ ..సూపర్ డూపర్ హిట్. అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వివి వినాయక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి. మే 12న విడుదల కానీ…కేవలం హిందీలో మాత్రమే. తెలుగులో కాదు. తెలుగు బెల్ట్ లో అంతకన్నా కాదు. మహా అయితే పెద్ద సెంటర్లలో హిందీ వెర్షన్ ఒకటి రెండు స్క్రీన్ లు పడొచ్చు.

తెలుగు హీరో, తెలుగు దర్శకుడు, తెలుగు వాళ్లకు పరిచయిన కథ. కానీ ఎందుకని తెలుగులో విడుదల చేయడం లేదు. ట్రోలింగ్ కు భయపడా? లేక చూసేసిన సినిమా అనేనా. చూసేసిన సినిమా అయితే ఏముంది? గతంలో అలా వచ్చినవి లేవా?

సాక్ష్యం, కవచం, సీత లాంటి డిజాస్టర్ సినిమాల తరువాత రాక్షసుడు వచ్చింది. ఆ తరువాత మళ్లీ అల్లుడు అదుర్స్ అంటూ ఓ ఫ్లాప్ మూవీ. ఆ తరవాత మరి తెలుగు సినిమా లేదు. చాలా గ్యాప్ కూడా వచ్చేసింది. మరి అలాంటపుడు భారీగా చేసిన ఛత్రపతిని తెలుగులో విడుదల చేస్తే కొంతయినా ప్రయోజనం వుంటుంది కదా.  కానీ అలా చేయడం లేదు ఏలనో.

ఛత్రపతికి హిందీ నాట ప్రచారం చేస్తున్నారు. పాటలు, కంటెంట్ ఏమి విడుదల చేసారో తెలుగు జనాలకు తెలియదు. తెలుగు నాట ఎలాగూ ప్రచారం లేదు. మరి అందుకే తెలుగుకు దూరం పెట్టారో. లేదా, ప్రభాస్-రాజమౌళి సీన్లతో పోల్చుకుని ట్రోలింగ్ చేస్తారనో. ట్రోలింగ్ చేసే వాళ్లు ఎలాగూ హిందీ వెర్షన్ చూసి అయినా చేస్తారు కదా. ఆ పాటి దానికి సినిమా విడుదల చేసుకోకుండా వుండడం ఏమిటో?