మొత్తానికి ఏదో అయినట్లుంది డైరక్టర్ రమేష్ వర్మకు…హీరో రవితేజకు మధ్య. ఈ మేరకు గత వారం పది రోజులుగా గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి. కానీ ఏవీ రూఢి కాలేదు. కానీ. ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రవితేజ మాటలు మాత్రం మరి కాస్త అనుమానాలను పెంచాయి.
నిర్మాత సత్యనారాయణ అన్నీ సమకూర్చి, మంచి టెక్నీషియన్లు ఇచ్చి, సినిమాను తయారు చేయించి, ఆపై కారు కూడా కొనిచ్చారు అంటే రమేష్ వర్మ మహర్ఙాతకుడు అన్నారు. కానీ దాని వెనుక ఎక్కడో సెటైర్ కొడుతోంది.
నిర్మాత సత్యనారాయణ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘మీరు దగ్గర వుండి చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. దాని వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తోంది. బోలెడు విషయాలు తెలుస్తాయి’ అంటూ మళ్లీ సైటైరికల్ గా, ఎక్కడో ఏదో ఇన్నర్ మీనింగ్ ధ్వనించేలా మాట్లాడారు.
రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే తాను ఈ సినిమా ఒప్పుకున్నానని, కేవలం అతను కథ చెప్పడం వల్లే సినిమా ఓకె చేసానని, కేవలం శ్రీకాంత్ వల్ల, నిర్మాత కోనేరు సత్యనారాయణ కారణంగానే సినిమా చేసాను తప్ప మరోటి కాదని క్లారిటీ ఇచ్చారు.
రమేష్ నీకు థాంక్స్ ఒక్క విషయంలోనే చెబుతా..అది కేవలం శ్రీకాంత్ ను పరిచయం చేసినందుకే అని కూడా అనడం విశేషం.
ఇలా అడుగు అడుగునా రమేష్ వర్మ కు రవితేజకు మధ్యలో ఏదో జరిగింది. అదేంటో తెలియదు. తెలియకపోయినా ఫరవాలేదు. ఖిలాడీ ఫలితం మీద పడకూడదు.
ఇప్పటికే రవితేజ ఆలస్యంగా డబ్బింగ్ చెప్పడం వల్ల ఓవర్ సీస్ లో ప్రీమియర్లు లేకుండా పోయాయి. అసలు అంతే కాదు ఓవర్ సీస్ లో బయ్యర్ లేని పరిస్థితి నెలకొంది.