హీరోయిన్ ఆత్మహత్య కేసు.. అతడు నిర్దోషి అంట!

సంచలనం సృష్టించిన జియా ఖాన్ ఆత్మహత్య కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చింది కోర్టు. ఈ కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోళీని నిర్దోషిగా ప్రకటించింది ముంబయి సీబీఐ కోర్టు. సూరజ్ వల్లనే జియాఖాన్…

సంచలనం సృష్టించిన జియా ఖాన్ ఆత్మహత్య కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చింది కోర్టు. ఈ కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోళీని నిర్దోషిగా ప్రకటించింది ముంబయి సీబీఐ కోర్టు. సూరజ్ వల్లనే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది కోర్టు.

2013, జూన్ 3న ముంబయిలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకుంది జియా ఖాన్. చనిపోతూ ఆమె 6 పేజీల సూసైడ్ నోట్ రాసింది. ఆ లేఖ ఆధారంగా సూరజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ లేఖలో సూరజ్ కు వ్యతిరేకంగా చాలా వాక్యాలున్నట్టు అప్పట్లో పోలీసులు తెలిపారు.

అయితే తాజాగా కోర్టు మాత్రం సూరజ్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చిచెప్పింది. జియాఖాన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సూరజ్ వ్యవహరించలేదని కోర్టు నమ్మింది. ఈ తీర్పును జియా ఖాన్ తల్లి పైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.

అమితాబ్ నటించిన నిశ్శబ్ధ్ సినిమాతో సంచలనం సృష్టించింది జియా ఖాన్. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. చేసిన 3 సినిమాలతోనే ఆమె తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది.

అదే టైమ్ లో ఆమె సూరజ్ పంచోళీతో లవ్ లో పడింది. దాదాపు ఏడాది పాటు వాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇలా కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా అంతా బాగుందని అనుకునేలోపే ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుంది జియాఖాన్. సూరజ్ తన కూతుర్ని మానసికంగా, శారీరకంగా హింసించాడని, అందుకే జియా సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి ఆరోపించింది. అప్పట్లో సూరజ్ ను కాపాడేందుకు సల్మాన్ ఖాన్ కూడా ప్రయత్నించాడంటూ కథనాలు వచ్చాయి.