జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైఖరిపై సొంత వాళ్లలో కూడా అనుమానం స్టార్ట్ అయ్యింది. పవన్ వైఖరితో జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా విసిగిపోతున్న పరిస్థితి. జనంలోకి వెళ్లేందుకంటూ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని పవన్‌కల్యాణ్ సిద్ధం చేసుకున్నారు. దీన్ని సినిమాటిక్‌గా జనానికి పరిచయం చేశారు. వారాహి రెడీ, ఇక జనంలోకి రావడమే ఆలస్యం అనే రీతిలో కొన్ని నెలల క్రితం జనసేన కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు.
సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ ఆలస్యమవుతున్న రీతిలో, జనంలోకి వారాహి రాక రోజురోజుకూ వాయిదా పడుతూనే వుంది. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో అసలు వారాహి జనంలోకి వస్తుందా? రాదా? అనే అనుమానాలు సొంత పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయి. కేవలం లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అవుతుందనే ఒకే ఒక్క కారణంతో వారాహి యాత్రను వాయిదా వేశారనే ప్రత్యర్థుల విమర్శలు నిజమని నమ్మే పరిస్థితి నెలకుంది.
ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్‌కల్యాణ్ సందర్శిస్తారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదే రోజు బహిరంగ సభలో కూడా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులు మాత్రం వారాహి యాత్ర వారం లేదా పది రోజుల్లో మొదలవుతుందని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. వారం, పది రోజులు కాస్తా నెలలవుతున్నా వారాహి ఇంచు కూడా కదల్లేని దయనీయ స్థితి.
దీంతో వారాహిపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఇంకా చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే వారాహి కదల్లేదని సెటైర్లు విసురుతున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలుపు తర్వాత జనసేనపై చంద్రబాబుకు మోజు తగ్గిందని, అందుకే పవన్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
వారాహి యాత్రకు ప్యాకేజీ ఖరారు కాలేదని, కేవలం డీజిల్ ఖర్చులు మాత్రమే ఇస్తామని టీడీపీ అంటోందని, డీల్ కుదరకపోవడంతో వారాహి ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వచ్చే అవకాశం లేదని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పంచ్‌లు విసురుతున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు తగ్గట్టే పవన్‌కల్యాణ్ నడుస్తుండడంతో జనసేన శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం నెలకుంది. ఈ వాస్తవాన్ని పవన్ ఎప్పుడు గ్రహిస్తారో మరి!