నేను బతికున్నంత వరకు జగనే సీఎం

సందర్భం దొరికిన ప్రతిసారి ముఖ్యమంత్రి జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి ఏమాత్రం వెనకాడరు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.  Advertisement తొలి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను దైవంతో పోల్చిన రాపాక.. ఆ…

సందర్భం దొరికిన ప్రతిసారి ముఖ్యమంత్రి జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి ఏమాత్రం వెనకాడరు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. 

తొలి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను దైవంతో పోల్చిన రాపాక.. ఆ తర్వాత తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తాజాగా మరోసారి రాపాకకు జగన్ పై తన అభిమానాన్ని చాటుకునే అవకాశం వచ్చింది.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాపాకకు పింఛన్లపై మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాపాక, తను బతికున్నంత కాలం జగనే సీఏం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్ ఇచ్చిన వరం వైఎస్ జగన్ అంటూ ప్రేమను కురిపించారు.

“గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమమైన ఆలోచనగా అందరూ మెచ్చుకుంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడు ఇలాంటి పనులు చేయలేదు. ఇంత చిన్న వయసులో జగన్ కు అలాంటి ఆలోచన రావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. నా వయసుకు నేను మరో సీఎంను చూడను. నేను బతికున్నంతవరకు ఆయనే ముఖ్యమంత్రి.”

ఇలా జగన్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు రాపాక. తన మనసుకే కాకుండా, ప్రజలందరి మనసులకు ఇలానే అనిపిస్తోందని.. జగన్ కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటారని రాపాక అన్నారు. 

ఓవైపు తమ నాయకుడు పవన్ కల్యాణ్, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. జగన్ పై విమర్శలు గుప్పిస్తుంటే.. రాపాక మరోసారి ఇలా ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు.