Advertisement

Advertisement


Home > Movies - Movie News

గ్యాప్ ఇచ్చిన చిరంజీవి.. కారణం ఏంటి?

గ్యాప్ ఇచ్చిన చిరంజీవి.. కారణం ఏంటి?

రాననుకున్నారా.. రాలేననుకున్నారా.. అనే సినిమా డైలాగ్ లాగా చిరంజీవి సోషల్ మీడియాలోకి కాస్త లేట్ ఎంట్రీ ఇచ్చినా ఫుల్ జోష్ చూపించారు. సోషల్ మీడియాలో తనదైన ట్రెండ్ సెట్ చేశారు. 

తన వయసువారు, తనకంటే చిన్నవారు, తన వారసుల కంటే కూడా.. చిరంజీవి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండేవారు. సినిమాలకు సంబంధం లేకుండా సాగేవి చిరు ట్వీట్లు.

ఇళ్లు చిమ్ముతున్నా, వంట చేస్తున్నా, కొడుకు చరణ్ కి కౌంటర్లిచ్చినా.. అన్నీ ట్విట్టర్లోనే సాగేవి. అలాంటి చిరంజీవి ఎందుకో కొన్నిరోజులుగా సోషల్ మీడియాకి దూరమయ్యారు.

మాస్క్ వాడకంపై సొంతగా ఓ మెసేజ్ ఓరియండెట్ వీడియో చేసి బైటకు వదిలిన చిరంజీవి.. ఆ తర్వాత తానే కరోనా బారిన పడిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 

ఆ తర్వాత తప్పుడు కిట్ ప్రాబ్లమ్ అంటూ వెంటనే మరో సంచలన ప్రకటన చేశారు. ఇక వెంటనే సినిమా సెట్ లోకి వచ్చేస్తున్నానంటూ మెసేజ్ ఇచ్చారు.

దీపావళి సందర్భంగా తన గురువు కె.విశ్వనాథ్ ఇంటికెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆశ్చర్యపరిచారు చిరు. తర్వాత సమంతకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ ఇటీవల కాలంలో చిరంజీవి ట్విట్టర్ యాక్టివిటీస్. ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాకి పూర్తిగా దూరమయ్యారు.

చిన్నాపెద్దా అందరి పుట్టినరోజులకి విషెస్ చెప్పే చిరంజీవి.. ఇప్పుడు ఎవర్నీ పలకరించడంలేదు. కనీసం తన సొంత సినిమా కబుర్లు కూడా చెప్పడంలేదు. ఇక వంటా వార్పు, శుభ్రత-పరిశుభ్రత.. ఇవేవీ లేవు. అసలింతకీ చిరంజీవి సోషల్ మీడియాకు ఎందుకు దూరమయ్యారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసిన ఫొటో కూడా తన అఫీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదంటే.. చిరు ఎందుకో సోషల్ మీడియాపై ఫోకస్ తగ్గించినట్టు కనిపిస్తోంది.  దీపావళి తర్వాత సోషల్ మీడియాలో చిరు సందడి పూర్తిగా తగ్గిపోయింది. అయితే చిరంజీవి కావాలని గ్యాప్ ఇచ్చారా లేక, ఇకపై పూర్తిగా అంటీముట్టనట్టుగానే ఉంటారా అనే విషయం తేలాల్సి ఉంది.

చంద్రబాబు కామెడీ లెక్చర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?