ఓటిటిల వ్యవహారం దూకుడు మీద వుంది. పోటీలు పడి సినిమాలు కొంటున్నాయి. అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి.
హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బతుకే సో బెటరు సినిమాను ఫస్ట్ కాపీ కొనేసిన జీ టీవీ అదే హీరో మరో సినిమాను నిర్మాణంలో వుండగానే కొనేసింది. పైగా నిర్మాణానికి ఫండింగ్ ఇస్తోంది. నిర్మాతకు ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది.
సాయి ధరమ్ తేజ్-దేవా కట్టా కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా ఒకటి వుంది. భగవాన్ పుల్లారావు నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూలు పనిలో వుండగానే జీటీవీ 35 కోట్లకు వరల్డ్ రైట్స్ కొనుగోలు చేసేసింది.
ఇక్కడి నుంచి విడతలు విడతలుగా అమౌంట్ విడుదల చేస్తుంది. సినిమాను పాతిక కోట్లలో కంప్లీట్ చేసుకోగలిగితే లాభమే లాభం. గతంలో సరైన కాంబినేషన్ తో సినిమా స్టార్ట్ చేస్తే ఏరియాల వారీ అడ్వాన్స్ లు వచ్చేవి ఇప్పుడు ఓటిటి అడ్వాన్స్ లు వస్తున్నాయి.
అప్పట్లో లాస్ట్ మినిట్ టెన్షన్ లు, సినిమా ప్లస్ మైనస్ ల సమస్యలు వుండేవి. ఇప్పుడు ఓటిటికి అయితే ఆ సమస్య కూడా లేదు.