కోలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఏ విషయంపైనైనా ఓపెన్ గా మాట్లాడ్డం ఆమె నైజం. దీనికితోడు విశాల్ తో లవ్ ఎఫైర్ అంటూ ఆమె చాన్నాళ్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఎకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ ఎకౌంట్స్ రెండూ హ్యాక్ అవ్వడం గమనార్హం.
తన సోషల్ మీడియా ఎకౌంట్స్ హ్యాక్ అయిన విషయాన్ని వరలక్ష్మి స్వయంగా బయటపెట్టింది. రాత్రి నుంచి ట్విట్టర్-ఇనస్టాగ్రామ్ ఎకౌంట్లు తన చేయి దాటిపోయాయని.. ప్రస్తుతం వాటిని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపింది.
తన ఎకౌంట్స్ తిరిగి తన కంట్రోల్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పడుతుందని.. ఈ లోగా తన ఎకౌంట్స్ లో ఏవైనా మెసేజ్ లు, ఫొటోలు వస్తే జాగ్రత్తగా ఉండాలని, వాటితో తనకు సంబంధం లేదని వరలక్ష్మి ప్రకటించింది. ఈ మేరకు ఆమె తన సంతకంతో ఓ ఓపెన్ లెటర్ రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు-తమిళ్-కన్నడ అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఆమె నటిస్తున్న 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటే, మరో 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. తెలుగులో ఆమె నాంది, క్రాక్ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు ఓటీటీలోకి కూడా ఎంటరైంది వరలక్ష్మి.