రచయితగా దిల్ రాజు భార్య?

టాలీవుడ్ కు ఇప్పుడు అతి పెద్ద కొరత హీరోలు కాదు..హీరోయిన్లు కాదు..ఫండింగ్ అంతకన్నా కాదు. కథలు. కాన్సెప్ట్ లు. కొత్త ఐడియా ఎవరు తెస్తే వాడే మొనగాడు.  Advertisement ఎవరు కథ తెస్తే వాళ్లే…

టాలీవుడ్ కు ఇప్పుడు అతి పెద్ద కొరత హీరోలు కాదు..హీరోయిన్లు కాదు..ఫండింగ్ అంతకన్నా కాదు. కథలు. కాన్సెప్ట్ లు. కొత్త ఐడియా ఎవరు తెస్తే వాడే మొనగాడు. 

ఎవరు కథ తెస్తే వాళ్లే సూపరు. ఓటిటి లు, ఏటిటిలు, థియేటర్లు అన్నీ కలిసి ఇప్పుడు సినిమా వ్యాపారాన్ని మరింత విస్తరించాయి. ఇలాంటి నేపథ్యంలో ఎందరో డబ్బులు పట్టుకుని రెడీగా వున్నారు. కానీ కథలు కావాలి.

ఇలాంటి నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు సతీమణి కూడా కథ రచయిత్రిగా మారుతున్నారని తెలుస్తోంది. దిల్ రాజు ఆస్థానంలో ఎందరో వర్ధమాన దర్శకులు, రచయితలు వున్నారు. 

నిత్యం కథలతో, పాయింట్లతో కుస్తీలు పడుతూనే వుంటారు. అవి ఒక కొలిక్కి వస్తే అప్పుడు దిల్ రాజు సీన్లోకి ఎంటరై, ఎవరితో చేయాలన్నది డిసైడ్ చేస్తుంటారు.

ఇప్పుడు ఈ విధంగానే నిర్మాత దిల్ రాజు భార్య కూడా ఓ పాయింట్ డెవలప్ చేసారని తెలుస్తోంది. దాన్ని సిన్మా స్క్రిప్ట్ గా మార్చడానికి ఓ టీమ్ ను దిల్ రాజు సెట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఆ టీమ్ సహకారంతో ఆమె స్క్రిప్ట్ తయారుచేస్తే, సినిమా తెరకెక్కడం పెద్ద కష్టమేం కాదు. దిల్ 'రాజు' తలుచుకుంటే సినిమాలకు కొదవా?

చంద్రబాబు కామెడీ లెక్చర్