ఎఫ్ఎమ్-పెద్ద పెద్ద పేర్లు వాడేస్తున్నారు

చకచకా ఆన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ యాప్ లు పుట్టుకువస్తున్నాయి. అలా వస్తున్న వాటిలో ఎఫ్.ఎమ్ (ఫ్రైడేమూవీస్) ఒకటి. దీనికి పెట్టుబడి అంతా అల్లు అర్జున్ స్నేహితుడు కేదార్ అండ్ కో ది. దీనికి…

చకచకా ఆన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ యాప్ లు పుట్టుకువస్తున్నాయి. అలా వస్తున్న వాటిలో ఎఫ్.ఎమ్ (ఫ్రైడేమూవీస్) ఒకటి. దీనికి పెట్టుబడి అంతా అల్లు అర్జున్ స్నేహితుడు కేదార్ అండ్ కో ది. దీనికి అన్ని విధాలా సాయం పడుతున్నది. 

కాస్తో కూస్తో పెట్టబడి పెడుతున్నది నిర్మాత బన్నీ వాస్. దీనికి తెరవెనుక కంటెంట్ సెలక్షన్, ఐడియాలజీ సాయం మారుతి లాంటి డైరక్టర్ ది. 

శ్రేయాస్ ఎటిటి లాంటిదే ఇదీనూ. అయితే ఎటొచ్చీ వీళ్లు సినిమాలు కొని స్ట్రీమింగ్ చేస్తారు. అలాగే పచారీ కొట్లలో కూడా ఫోన్ రీచార్జ్ చేసుకున్నట్లు యాప్ బ్యాలన్సీ రీచార్జ్ చేసుకునే పద్దతి ప్రవేశపెడుతున్నారు. 

నిజానికి గూగుల్ పే, ఫోన్ పే లాంటి సౌకర్యాలు పల్లెటూళ్లకు కూడా పాకేసాయి. ఆధార్ ఏటిఎమ్ లు చిన్న చిన్న పల్లెల్లో కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల కుర్రాళ్లు యాప్ లో సినిమా చూసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చూసేస్తారు.

కానీ అలా చూడాలి అనిపించాలంటే ఆ యాప్ కు ఇంతో అంతో పబ్లిసిటీ కావాలి. ఇప్పడు అందుకోసం ఎఫ్ ఎమ్ నుంచి రకరకాల ఫీలర్లు బయటకు వదులుతున్నట్లు కనిపిస్తోంది. 

బన్నీ వాస్ ఈ యాప్ వెనుక వుండడంతో, పెద్ద పెద్ద డైరక్టర్లు అంతా భాగస్వామ్యులు అన్నట్లు గ్యాసిప్ లు పుట్టించేస్తున్నారు, త్రివిక్రమ్ కు భాగస్వామ్యం వుందని, సుకుమార్ కు పార్టనర్ షిప్ వుందని న్యూస్ లు పుట్టించేస్తున్నారు.

ఆహా అడిగితేనే ఇప్పటి వరకు ఇంకా ఏ కంటెంట్ రెడీ చేయలేదు త్రివిక్రమ్. అలాంటిది ఓ చిన్న ఏటిటికి కంటెంట్ రెడీ చేస్తారా?  పెట్టుబఢి పెడతారా? అలాగే సుకుమార్ కూడా కంటెంట్ ఇచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. 

పెట్టుబడి కూడా అనుమానమే. కావాలంటే ఆయన ఓ పబ్లిసిటీ బైట్ ల్లాంటివి ఇచ్చే అవకాశం వుంది. అది కూడా బన్నీ వాస్ కు ఆప్త మిత్రుడు కాబట్టి. అలాగే కేదార్ నిర్మాతగా సినిమా చేయబోతున్నారు కాబట్టి.

ఇంతకీ బన్నీవాస్ కు అత్యంత స్నేహితుడు కదా హీరో బన్నీ ఆహాకు చేసినట్లే ఎఫ్ ఎమ్ కు కూడా ఏమైనా అడ్వర్ టైజ్ మెంట్ చేసి ఇస్తారా? ఏమో? 

నేత‌ల‌ను బజారుకీడ్చిన సొంత ప‌త్రిక‌లు