టచ్ మీ నాట్ అంటున్న గంటా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ గా అంత యాక్టివ్ గా లేరన్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూంటే ఆయన వరసగా రెండు రోజులూ డుమ్మా  కొట్టారు. ఇక ఆయన పుట్టిన…

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ గా అంత యాక్టివ్ గా లేరన్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూంటే ఆయన వరసగా రెండు రోజులూ డుమ్మా  కొట్టారు. ఇక ఆయన పుట్టిన రోజు కూడా ఈసారి సాదా సీదాగా జరిగిపోయింది.

పార్టీ నేతలు ఎవరూ కటౌట్లు పెట్టలేదు. ఆయన అభిమానులు మాత్రమే  కొంత హడావుడి చేశారు. ఇక  అసెంబ్లీకి రాని గంటా ఈసారి సమావేశాలు సజావుగా సాగాలని కోరుకోవడం విశేషం.

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావాలని ఆకాంక్షించడమూ విడ్డూరమే. ఇక దానికి మించి ఆయన నొప్పించక తానొవ్వక తీరులో చేసిన కామెంట్స్ పొలిటికల్ గా చర్చకు దారి తీస్తున్నాయి.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఏదో చేయాలని తపన పడే నాయకుడు అంటూ గంటా కీర్తించారు. ఇక ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు విపక్ష నేత అంటూ ఆయన్నీ పొగిడారు. 

ఈ ఇద్దరూ కలసి ప్రజా సమస్యల మీద చర్చిందాలని గంటా గట్టిగా కోరుకున్నారు. అంటే తాను మాత్రం ఏ పార్టీకి చెందని నేతను అని ఆయన చెప్పుకుంటున్నారా అన్నదే ఇక్కడ డౌట్.  

మొత్తానికి గంటా రెండు పార్టీలకు దూరంగా ఉన్నారా. దగ్గరగా ఉన్నారా అన్నది అనుచరులకే అర్ధం కావడంలేదుట.

నేత‌ల‌ను బజారుకీడ్చిన సొంత ప‌త్రిక‌లు