బాబుమోహన్, కోట మధ్య బాధాకరమైన బంధం

సిల్వర్ స్క్రీన్ ఎవర్ గ్రీన్ కామెడీ కాంబినేషన్లలో ఒకటి కోట-బాబుమోహన్ జోడీ. 90వ దశకంలో ప్రత్యేకంగా వీళ్ల కోసం కామెడీ ట్రాక్ రాసేవాళ్లు దర్శకులు. నేరుగా స్క్రిప్ట్ లోనే పాత్రల పేర్లు కాకుండా.. కోట…

సిల్వర్ స్క్రీన్ ఎవర్ గ్రీన్ కామెడీ కాంబినేషన్లలో ఒకటి కోట-బాబుమోహన్ జోడీ. 90వ దశకంలో ప్రత్యేకంగా వీళ్ల కోసం కామెడీ ట్రాక్ రాసేవాళ్లు దర్శకులు. నేరుగా స్క్రిప్ట్ లోనే పాత్రల పేర్లు కాకుండా.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ అని రాసేవాళ్లు. అంత డిమాండ్ ఉండేది వాళ్లది.

తెరపైనే కాకుండా, తెరవెనక కూడా వీళ్ల బంధం అలానే కొనసాగింది. తెరపై కొట్టుకుంటూ కామెడీ పండించే ఈ ఇద్దరు నటులు.. తెరవెనక మాత్రం అన్నదమ్ముల్లా కలిసిపోయారు. వీళ్ల మధ్య ఉన్న స్నేహబంధమే కాకుండా..  విధి కూడా వీళ్లిద్దరి మధ్య ఓ బలీయమైన, బాధాకరమైన బంధాన్ని ఏర్పరిచింది.

అటు కోట, ఇటు బాబుమోహన్ ఇద్దరూ తమ కుమారుల్ని పోగొట్టుకున్నారు. అది కూడా రోడ్డు ప్రమాదాల్లోనే. అంతేకాదు.. ఆ ప్రమాదాలు జరిగిన విధానం కూడా ఒకేలా ఉండడం కేవలం విధి.

బాబు మోహన్ కొడుకు ముందు బైక్ పై వెళ్తున్నారు. వెనక చిన్నబ్బాయి కారులో వస్తున్నాడు. అప్పుడు యాక్సిడెంట్ లో కొడుకు మరణించాడు. కోట శ్రీనివాసరావుకు కూడా ఇలానే జరిగింది. కోట తనయుడు ముందు బైక్ పై వెళ్తున్నాడు. వెనక కోడలు-పిల్లలు కారులో వస్తున్నారు. ఆ యాక్సిడెంట్ లో కోట తన కొడుకును కోల్పోయారు.

ఇలా ప్రాణస్నేహితులమైన తామిద్దరం, ఒకే విధంగా కొడుకుల్ని పోగొట్టుకున్నామని బాధపడ్డారు కోట-బాబుమోహన్. లక్షలాది మందిని నవ్వించిన తమకు జీవితాంతం ఏడ్చేలా దేవుడు శిక్ష విధించాడని మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

పేపర్లు విసిరేసిన తమ్మినేని