3 రోజుల్లో 44 కోట్లు.. కెరీర్ హయ్యస్ట్

ఊహించినట్టుగానే శని, ఆదివారం విరూపాక్ష సినిమా రఫ్ఫాడించింది. రిలీజైన శుక్రవారంతో పోలిస్తే, శని-ఆదివారాలు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఎక్కువగా కనిపించింది. ఫలితంగా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి, సాయిధరమ్…

ఊహించినట్టుగానే శని, ఆదివారం విరూపాక్ష సినిమా రఫ్ఫాడించింది. రిలీజైన శుక్రవారంతో పోలిస్తే, శని-ఆదివారాలు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఎక్కువగా కనిపించింది. ఫలితంగా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి, సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విరూపాక్ష సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ అటుఇటుగా 17 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మూవీకి నైజాం నుంచి ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా విరూపాక్ష హిట్టయింది, సాయితేజ్ కెరీర్ లో అక్కడ కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఓవర్సీస్ లో మొదటి వారాంతానికి 6 కోట్ల రూపాయల వసూళ్ల సాధించిన ఈ సినిమా, త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరబోతోంది. ఈ సినిమా రాకతో విడుదల పార్ట్-1, శాకుంతలం సినిమాలు దాదాపు వాష్ అవుట్ అయ్యాయి.

సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమా మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్లాప్ అయింది. విరూపాక్ష రావడంతో మరో వీకెండ్ ఛాన్స్ లేకుండా పోయింది ఈ సినిమాకి. అటు విడుదల పార్ట్-1 సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం పట్టించుకోలేదు.