మమ్మల్ని తెలంగాణలో కలపండి- జేసీ

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రి నుండి త‌ప్పుకుని వారసులకు అవ‌కాశం ఇచ్చి ఎన్నిక‌ల్లో బోల్తా ప‌డిన జేసీ బ్ర‌ద‌ర్స్ లో.. ఒక్క‌రు మున్సిపాల్ వార్డ్ మెంబ‌ర్ గా గెలిచి రాజ‌కీయ చేస్తుంటే, ఇంకొకరు అప్పుడ‌ప్పుడు…

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రి నుండి త‌ప్పుకుని వారసులకు అవ‌కాశం ఇచ్చి ఎన్నిక‌ల్లో బోల్తా ప‌డిన జేసీ బ్ర‌ద‌ర్స్ లో.. ఒక్క‌రు మున్సిపాల్ వార్డ్ మెంబ‌ర్ గా గెలిచి రాజ‌కీయ చేస్తుంటే, ఇంకొకరు అప్పుడ‌ప్పుడు మీడియాకు క‌న‌ప‌డుతూ ఏదో ఒకటి మాట్లాడుతూ త‌న ఉనికిని కాపాడుకుంటూ వ‌స్తున్న మాజీ మంత్రి జేసీ దివాక‌ర్ తాజాగా మ‌రో విచిత్ర‌మైన డిమాండ్ చేశారు.

జేసీ దివాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాయ‌ల‌సీమ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని.. అప్పుడే రాయ‌ల‌సీమ సాగునీటి స‌మ‌స్య తీరుతుంద‌ని జోస్యం చెప్పారు. అలాగే ప‌నిలో ప‌నిగా రాష్ట్రాన్ని విడగొట్టడం కష్టంగాని క‌ల‌ప‌డం సుల‌భ‌మ‌ని ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చారు. రాయ‌ల‌సీమను తెలంగాణ‌లో క‌లిపితే ఎవ‌రికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఆయ‌నే సర్టిఫికెట్ ఇచ్చారు.

కాగా గ‌తంలో కూడా ఉమ్మ‌డి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణలో విలీనం చేసి రాయ‌ల‌తెలంగాణ‌గా ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీలో మంత్రి హోదాలో డిమాండ్ చేయ‌డం తెలిసిందే. రాష్ట్రా విభ‌జ‌న జ‌రిగి కూడా దాదాపు తొమ్మిది సంవ‌త్సరాలు గ‌డుస్తున్నా రాయ‌లసీమ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని డిమాండ్ చేయ‌డం హాస్యాస్పదంగా ఉందంటూన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.