మళ్లీ థియేటర్లు టైట్

విరూపాక్ష సినిమా విడుదలయ్యే వరకు సమ్మర్ హీట్ అందుకోలేదు. ఈ హీట్ కు ఇప్పుడు మరో సినిమా ఏజెంట్ తోడు అవుతోంది. విరూపాక్ష సినిమా సెకెండ్ వీక్ ఎలాగూ చాలా వరకు థియేటర్లలో వుంటుంది.…

విరూపాక్ష సినిమా విడుదలయ్యే వరకు సమ్మర్ హీట్ అందుకోలేదు. ఈ హీట్ కు ఇప్పుడు మరో సినిమా ఏజెంట్ తోడు అవుతోంది. విరూపాక్ష సినిమా సెకెండ్ వీక్ ఎలాగూ చాలా వరకు థియేటర్లలో వుంటుంది. ముఖ్యంగా కీలకమైన వైజాగ్, నైజాంల్లో చాలా థియేటర్లలో వుంటుంది. 

ఈ వారం ఏజెంట్, పిఎస్ 2 విడుదలవుతున్నాయి. ఈ రెండూ నైజాంలో దిల్ రాజు నే. అందువల్ల జాగ్రత్తగా థియేటర్లు పంచాల్సి వుంటుంది. వైజాగ్ లో పిఎస్ 2 దిల్ రాజునే. అందువల్ల అక్కడ అర్బన్ ఏరియాల్లో థియేటర్లు ప్లానింగ్ తప్పదు.

ఇదిలావుంటే ఆ పై వారం రెండు సినిమాలు వస్తున్నాయి. రామబాణం. ఉగ్రం. వాటికీ ఎన్నో కొన్ని థియేటర్లు అవసరం పడతాయి. ఏజెంట్ టాక్, విరూపాక్ష రన్ బట్టి వీటి థియేటర్ల లెక్కలు వుంటాయి. ఆ వారం ఆగితే నాగ్ చైతన్య పెద్ద సినిమా కస్టడీ వస్తోంది. దాంతో కాస్త గట్టిగానే విడుదల ప్లాన్ చేయాల్సి వుంటుంది.

అంటే దాదాపు ఏప్రిల్ మూడో వారం నుంచి మే రెండో వారం వరకు థియేటర్లకు డిమాండ్ వుంటుంది. మే మూడోవారానికి చిన్న సినిమాల రన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫరవాలేదు. మళ్లీ ఆదిపురుష్ వచ్చే వరకు థియేటర్ల సమస్య పెద్దగా వుండదు. ఈ లోగానే కాస్త లెక్క పెట్టి థియేటర్లు చూసుకోవాల్సి వుంటుంది.