డైరక్టర్ గా విష్వక్ సేన్

సినిమా ఫుల్ లెంగ్త్ డైరక్టర్ గా వుంటాడా? లేదా డైరక్టర్ గా ప్రయత్నించే హీరో పాత్రనా?

హీరో విష్వక్ సేన్ ఎప్పుడో డైరక్టర్‌గా మారారు. ఇప్పుడు కొత్తగా డైరక్టర్ గా విష్వక్ సేన్ అనడం ఏమిటి అని అనేయద్దు తొందరపడిపోయి. ఇప్పుడు విష్వక్ సేన్ సినిమా డైరక్ట్ చేయబోవడం లేదు. ఓ సినిమాలో డైరక్టర్ గా కనిపించబోతున్నాడు. త్వరలో చేయబోయే సినిమాలో విష్వక్ సేన్ డైరక్టర్ పాత్ర పోషించబోతున్నారట. దీనికి దర్శకుడు అనుదీప్.

అనుదీప్ అంటే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్. కామెడీ. మరి అలాంటి డైరక్టర్ విష్వక్ కోసం డైరక్టర్ పాత్రను తయారు చేసారు అంటే ఫుల్ ఫన్ వుంటుందనుకోవాలి. కథ వివరాలు ఇంకా తెలియవు కానీ పాత్ర మాత్రం డైరక్టర్ అని తెలుస్తోంది.

సినిమా ఫుల్ లెంగ్త్ డైరక్టర్ గా వుంటాడా? లేదా డైరక్టర్ గా ప్రయత్నించే హీరో పాత్రనా? అన్నది కూడా తెలియాల్సి వుంది. సినిమాలో డైరక్టర్ పాత్ర హీరో చేస్తున్నారు అంటే, అది కూడా ఫన్ జోనర్ లో అంటే సినిమాలో సినిమా షూటింగ్ లు, వాటి ఫన్ లు కూడా చోొటు చేసుకుంటాయేమో? అనుదీప్ సెటైర్లు కూడా బాగానే వేస్తారు. అందువల్ల సినిమాలో సినిమా కథ చెబుతూ సెటైర్ లు కూడా వేస్తారనే అనుకోవాలి.

మెకానిక్ రాఖీ, లైలా తరువాత విష్వక్ చేస్తున్న సినిమా ఇది. దీని తరువాత భీమ్లా నాయక్ డైరక్టర్ సాగర్ కు ఓకె చెప్పారు. అది పట్టాలు ఎక్కాల్సి వుంది. కానీ ఇటీవల విష్వక్ చెప్పడం ఏమిటంటే.. కొన్నాళ్లు మిగిలిన సినిమాలు ఆపి ఫలక్ నుమా దాస్ ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేస్తానని. అందువల్ల అనుదీప్ సినిమా తరువాత అది వుంటుందేమో చూడాలి.

2 Replies to “డైరక్టర్ గా విష్వక్ సేన్”

Comments are closed.