మీ తండ్రి హ‌యాంలోనూ ఆర్థిక విధ్వంస‌మే సార్‌!

త‌మ తండ్రి హ‌యాంలో జ‌రిగింది కూడా ఆర్థిక విధ్వంస‌మే లోకేశ్ సార్ అంటూ నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు.

మంత్రి నారా లోకేశ్‌కు స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో చెల్లించిన వ‌డ్డీలు గుర్తుకొచ్చాయి. జ‌గ‌న్ హ‌యాం నాటి లెక్క‌ల్ని తెర‌పైకి తీసుకొచ్చి… ఇదిగో ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంటూ ఎక్స్‌లో పోస్టు, అందుకు బ‌లం క‌లిగించే ప‌త్రాలేవో ఆయ‌న షేర్ చేశారు. అయితే లోకానికి అన్నీ తెలుస‌న్న సంగ‌తి లోకేశ్ విస్మ‌రించిన‌ట్టున్నారు.

అయ్యా లోకేశ్‌, త‌మ‌రి హ‌యాంలో సంప‌దేమీ సృష్టించ‌లేదు, ఇవిగో మీరు చెల్లించిన భారీ వ‌డ్డీలంటూ నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అంతేకాదు, వాటికి ఆధారాల్ని కూడా షేర్ చేయ‌డం విశేషం. ముందు లోకేశ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు సంగ‌తేందో చూద్దాం.

“రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అందినకాడికి అప్పులు చేశారు. 58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా… జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి… అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరింది. అంటే అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11వేల కోట్లు అధికం. జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనం” అని లోకేశ్ ఘాటు విమ‌ర్శ చేశారు.

అయితే 2014లో విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారాన్ని చేప‌ట్టిన టీడీపీ ప్ర‌భుత్వం …దిగిపోయే నాటికి, అంటే 2019 నాటికి చెల్లించిన వ‌డ్డీలేమీ త‌క్కువ‌గా లేవు. అంత‌కు ముందు వ‌ర‌కూ 58 ఏళ్ల‌లో అన్ని ప్ర‌భుత్వాలు చెల్లిస్తూ వ‌చ్చిన వడ్డీ కంటే, రెట్టింపు వుండ‌డం గ‌మ‌నార్హం. ఆ లెక్క‌లేంటో తెలుసుకుందాం.

1956లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్పాటై న‌ప్ప‌టి నుంచి 2014 వరకు కేవలం రూ. 7,488 కోట్లు వ‌డ్డీ మాత్ర‌మే ప్ర‌భుత్వాలు చెల్లించేవి. కానీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2014లో రెండుగా విడిపోయింది. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను మొద‌టిసారిగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప‌రిపాలించారు. 2018-19 నాటికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్పులపై చెల్లించిన వ‌డ్డీ రూ.15,342 కోట్లకు పెరిగింది. అంటే రూ.7,854 కోట్ల వ‌డ్డీ అధికం అన్న సంగ‌తిని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్ ఆర్థిక విధ్వంసం చేశార‌ని లోకేశ్ ప్ర‌కారం ఒప్పుకుందామంటూనే, మ‌రి చంద్ర‌బాబు స‌ర్కార్ సంప‌ద సృష్టి ఎక్క‌డో చెప్పాలి క‌దా? అని నెటిజ‌న్లు నిల‌దీయ‌డం విశేషం.

త‌మ తండ్రి హ‌యాంలో జ‌రిగింది కూడా ఆర్థిక విధ్వంస‌మే లోకేశ్ సార్ అంటూ నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు. అయినా అన‌వ‌స‌రంగా వ‌డ్డీల లెక్క‌లు తెర‌పైకి తీసుకొచ్చి, నిజాలేవో చెప్పేలా చేసి, న‌వ్వుల‌పాలు కావ‌డం అంటే ఇదే కాబోలు అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

37 Replies to “మీ తండ్రి హ‌యాంలోనూ ఆర్థిక విధ్వంస‌మే సార్‌!”

  1. చంద్రబాబు అప్పులు చేసైనా కాపిటల్ expenditure చేశారు కాబట్టే కియా , హీరో , Asian Paints, బ్రిటానియా లాంటి సంస్థలు వచ్చి jobs కూడా దొరికింది. కంపెనీలు ఉద్యోగుల కట్టే పన్నులు ద్వారా సంపద కూడా వచ్చింది….

      1. నెల నెల డబ్బులు పంచేయడానికి .. అభివృద్ధికి లింక్ ఏమిటో చెప్తే సరి ..

      1. Capital expenditure (CapEx) by a state government is the money spent on long-term investments that create or improve physical assets. These assets can include roads, bridges, dams, and power plants. 

        Evariki teliyady… accounts lo money distribution kaadhu

    1. There is no relationship between capital expenditure and the above company setups. Do you know what is capital expenditure? These companies are setup in Amaravathi . Isn’t it? They are not. How much he spent for these company setups. Gave freeland? 100-1000 crores worth? Nope.. Check the facts and educate yourself on public spending and expenditure

      1. Get some basic knowledge before commenting. What is capital expenditure? Who is the teacher? Where did you studied. Capital expenditure means for spending Amaravati capital, wow what an understanding, Take a bow

        1. Capital expenditure (CapEx) by a state government is the money spent on long-term investments that create or improve physical assets. These assets can include roads, bridges, dams, and power plants.

  2. సంపద సృష్టించడం అంతే రోడ్ లు వెయ్యడం కంపెనీ లు తెప్పించడం ఒక రాజధాని ఒక పోలవరం ఒక బ్రిడ్జి వీటి కోసం ఎంతయినా అప్పులు పర్లేదు. కానీ పంచడానికి ఉచితాలకు ఎందుకు lచెయ్యాలి దాని వల్ల యూసు లేదు

  3. జగన్ కన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా మంచోడు… అనే భావనను జగన్ గత 5 ఏళ్లలో తన చేతగాని అసమర్థ విధ్వంసకర అవినీతికరమైన పాలన ద్వారా నిరూపించాడు…

    వీడు మళ్ళీ వద్దురా బాబోయ్ అనేట్టు చేశాడు…కాదు కాదు చేసుకున్నాడు…

    అందుకనే 11 సీట్లకే పరిమితం అయ్యాడు…

    సో… ఏ రకంగా చూసుకున్నా జగన్ కన్నా పవన్,లోకేష్ లు 100 రెట్లు మేలు…

    కాదంటారా…బులుగు paytm కుక్కల్స్

  4. జగన్ కన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా మంచోడు… అనే భావనను జగన్ గత 5 ఏళ్లలో తన చేతగాని అసమర్థ విధ్వంసకర అవినీతికరమైన పాలన ద్వారా నిరూపించాడు…

    వీడు మళ్ళీ వద్దురా బాబోయ్ అనేట్టు చేశాడు…కాదు కాదు చేసుకున్నాడు…

    అందుకనే 11 సీట్లకే పరిమితం అయ్యాడు…

    సో… ఏ రకంగా చూసుకున్నా జగన్ కన్నా పవన్,లోకేష్ లు 100 రెట్లు మేలు…

    కాదంటారా…బులుగు పేటీఎం కుక్కల్స్

    1. check economy during CBN terms and congress terms, you will realise. Check number of projects, electricity production, supporting farmers, welfare, GDP growth , education supported by government, Government hospitals and public health, etc.. You will realise . Sorry of you still have brain 🧠 you will understand the facts. Iconic buildings and real estate are not considered as Development

  5. మన రాష్ట్రము లో రాజకీయ నాయకులకు అధికారులకు వాళ్ళు ప్రభుత్వ పదవులు పొందేనాటి ఆస్తులకు వాళ్ళు ఆస్తులను వారసులకు పంచె నాటి ఆస్తులకు వ్యత్యాసం పది రెట్లకన్నా ఎక్కువ ఉంటే వాళ్లకు వారసత్వ పన్నుగా 90 % వెయ్యాలిసిందే మనం జగన్ గారి కేసు చూసిన తర్వాత అవి అయన బతికి ఉండగా తేలనివ్వరు తర్వాత కేసు గురించి పట్టించుకోరు ఆ తర్వాత క్విడ్ ప్రోకో పద్దతులలో కేసు కొట్టించేసు కొంటారు

  6. జగన్ కన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా మంచోడు… అనే భావనను జగన్ గత 5 ఏళ్లలో తన చేతగాని అసమర్థ విధ్వంసకర అవినీతికరమైన పాలన ద్వారా నిరూపించాడు…

    వీడు మళ్ళీ వద్దురా బాబోయ్ అనేట్టు చేశాడు…కాదు కాదు చేసుకున్నాడు…

    అందుకనే 11 సీట్లకే పరిమితం అయ్యాడు…

    సో… ఏ రకంగా చూసుకున్నా జగన్ కన్నా పవన్,లోకేష్ లు 100 రెట్లు మేలు…

    కాదంటారా…బులుగు paytm కుక్కల్స్

Comments are closed.