చంద్రబాబు డిజైన్లను తలదన్నేలా రేవంత్.. !

తెలంగాణలో ప్రస్తుతం నిజాం కాలం నాటి భవనాల్లో హైకోర్టు సముదాయం కొనసాగుతోంది.

ఇప్పటిదాకా ఐకానిక్ భవనాల నిర్మాణాల పేరుతో వేలకు వేల కోట్ల రూపాయల వ్యయంతో భవనాలను నిర్మించే కసరత్తు చేస్తున్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. అయితే ఇప్పుడు గురువును మించిన శిష్యుడు తయారయ్యారు.

చంద్రబాబునాయుడుకు శిష్యుడు అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు ఆలోచనల్ని, ఖర్చుల్ని, బడ్జెట్ లను తలదన్నేలా ప్లాన్ చేస్తున్నారు. తమ రాష్ట్రానికి సరికొత్త హైకోర్టు భవనాలను నిర్మించేందుకు జరుగుతున్న కసరత్తులో.. రేవంత్ రెడ్డి అనూహ్యమైన అంచనాలతో డిజైన్లను రూపొందింపజేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

తెలంగాణలో ప్రస్తుతం నిజాం కాలం నాటి భవనాల్లో హైకోర్టు సముదాయం కొనసాగుతోంది. అయితే ఇప్పటి అవసరాలకు అవి చాలడం లేదనే ఉద్దేశంతో కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం కోసం కసరత్తు మొదలుపెట్టారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు రేవంత్ సర్కారు డిజైన్లు సిద్ధం చేయించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇందుకోసం ఏకంగా 2583 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. వంద ఎకరాల్లో ఏకంగా 16 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మాణాలు పది బ్లాకులతో జరగబోతున్నాయి. జడ్జిల క్వార్టర్లు కూడా అక్కడే నిర్మించబోతున్నారు.

చంద్రబాబునాయుడు అమరావతిలో సచివాలయం, హైకోర్టు, ఎడ్మినిస్ట్రేటివ్ భవనాలకు ఐకానిక్ బిల్డింగులకు డిజైన్లు సిద్ధం చేయించారు. ఏపీ హైకోర్టు భవనాలకు చంద్రబాబు చేయించిన అంచనా బడ్జెట్ లు 1049 కోట్లు మాత్రమే. కొంతమేర రివైజ్ అయితే కావొచ్చు. అయితే.. ఇది కేవలం హైకోర్టు భవనాల వరకు ఐకానిక్ భవనానికి మాత్రమే. జడ్జిల క్వార్టర్ల నిర్మాణానికి వేరే స్థలం కేటాయించారు.

ఎలా చూసినా సరే.. చంద్రబాబు హైకోర్టు మీద పెడుతున్న ఖర్చు కంటె.. రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్న బడ్జెట్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ డిజైన్లను, ప్లాన్ లను చూసిన తర్వాత.. చంద్రబాబునాయుడు మరింతగా రెచ్చిపోయి.. ఇంతకంటె ఎక్కువ ఖర్చు పెడితే తప్ప.. తాను గొప్పగా చేసినట్టు గుర్తింపు రాదేమోనని ఆరాటపడతారా? హైకోర్టు ఐకానిక్ భవనాల కోసం మళ్లీ కొత్త డిజైన్లను సిద్ధం చేయించాలనుకుంటారా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.

19 Replies to “చంద్రబాబు డిజైన్లను తలదన్నేలా రేవంత్.. !”

  1. అందరిలొకీ మన జగనన్నె గ్రేట్ అన్నావుగా!

    చంద్రబాబు హైకొర్ట్ కి వెయ్యి కొట్లు కర్చు అయితె మన అన్న తన క్యాంపు నివాసానికె 500 కొట్లు కర్చు చెసాడుగా.

    పైగా మరొ 200 కొట్లు NGT ఫైన్! మొత్తం ప్యాలెస్స్ కర్చు 700 కొట్లు!!

  2. అందరిలొకీ మన జగనన్నె గ్రేట్ అన్నావుగా!

    చంద్రబాబు హైకొర్ట్ కి 1049 కొట్లు కర్చు అయితె మన అన్న తన క్యాంపు నివాసానికె 500 కొట్లు కర్చు చెసాడుగా.

    పైగా మరొ 200 కొట్లు NGT ఫైన్! మొత్తం ప్యాలెస్స్ కర్చు 700 కొట్లు!!

  3. అందరిలొకీ మన జగనన్నె గ్రే.-.ట్ అన్నావుగా!

    .

    చంద్రబాబు హైకొర్ట్ కి 1049 కొ.-.ట్లు కర్చు అయితె మన అన్న తన క్యాంపు నివాసానికె 500 కొ.-.ట్లు కర్చు చెసాడుగా.

    పైగా మరొ 200 కొ.-.ట్లు NGT ఫైన్! మొత్తం ప్యాలెస్స్ కర్చు 700 కొ.-.ట్లు!!

    1. You are correct. Now Jagan is staying in that palace. It is his own property and the government spent a lot for his own property. It is not state property. Water leakage temporarily buildings constructed during 2014-19 was not all considered as waste spend in your eyes. How many 1000s of crores were spent for temporary building? Check the facts.

      1. Bafoon! Does anyone spends hundreds crores for state amenities/infra or for his place to live?

        .

        AP High court is across 20.32 lakh square feet and costs Rs 1,048 crore as per GA

        Rishikonda place is in 1.46 lakh square feet and costs of Rs appox 700 crore (500 Cr+200 Cr NGT fine)

  4. Samvatsaram lo edo rendu buildings katteyaka ee design lolli endi ra ayya. Anduke amaravathi lo just normal constructions chesukuntoo potunnaru. ee design picchi endi. ye kaalam lo vunnaru raa meerantha.

  5. రిషికొండ ప్యాలెస్స్ విస్తీర్ణం 1.46 ల.-.క్ష.-.ల చదరపు అడుగులు..కర్చు సుమ్మరు 500 కొట్లు. NGT ఫైన్ 200 కొట్లు తొ కలిపి సుమ్మరు 700 కొట్లు. (అంటె చదరపు అడుగు కర్చు సుమ్మరు 47,945 రూపాయలా?)

    .

    GA ప్రకారం… తెలంగానా మొత్తం హైకౌర్ట్ సముదాయం విస్తీర్ణం 16 ల.-.క్ష.-.ల చదరపు అడుగులు, కర్చు 2583 కొట్లు (అంటె చదరపు అడుగు కర్చు సుమ్మరు 16,143 రూపాయలు)

    .

    మరి విచ్చల విడిగా కర్చు పెట్తింది మన జగన్ అన్నె కదా?

Comments are closed.