నిజజీవితంలో కూడా హ్యాండిచ్చిందా?

తెలుగొచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమౌతుందో సినిమాలు చేసిన తర్వాత నాకు తెలిసొచ్చింది.

ఉన్నట్టుండి సడెన్ గా పెద్ద బాంబ్ పేల్చాడు నిర్మాత ఎస్.కె.ఎన్. రాత్రి ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన ఈ నిర్మాత ఇకపై తెలుగు హీరోయిన్లకు ఛాన్సులివ్వనని బహిరంగంగా ప్రకటించాడు.

“టాలీవుడ్ లో తెలుగొచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్నే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం. తెలుగొచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమౌతుందో సినిమాలు చేసిన తర్వాత నాకు తెలిసొచ్చింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే ఎంకరేజ్ చేయాలని నేను, నా డైరక్టర్ సాయిరాజేష్ నిర్ణయించుకున్నాం.”

ఒకప్పుడు తెలుగమ్మాయిల్ని మాత్రమే ప్రోత్సహిస్తానని చెప్పిన ఈ ప్రొడ్యూసర్, ఇప్పుడు ఏకంగా ప్లేట్ ఫిరాయించడం వెనక చాలా పెద్ద కథ నడిచిందంటున్నారు చాలామంది. మరీ ముఖ్యంగా ఎక్కువమంది ‘బేబి’ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య వైపు వేలు చూపిస్తున్నారు.

ఆ సినిమా సక్సెస్ తర్వాత ఈ నిర్మాతకు, ఆ హీరోయిన్ కు ఏదో జరిగి ఉంటుందనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇక్కడే సినిమాలో వైష్ణవి చైతన్య పాత్రను హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు.

సినిమాలో హీరోకు హ్యాండ్ ఇస్తుంది హీరోయిన్. ఇప్పుడు నిజజీవితంలో కూడా నిర్మాతకు ఈ హీరోయిన్ అలా హ్యాండ్ ఇచ్చి ఉంటుందని, అందుకే ఎస్.కె.ఎన్ అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చాడని అంటున్నారు.

6 Replies to “నిజజీవితంలో కూడా హ్యాండిచ్చిందా?”

Comments are closed.