L2 Empuraan Review: మూవీ రివ్యూ: ఎల్ 2 ఎంపురాన్(లూసిఫర్ 2)

కంటెంట్ కంటే ఎలివేషన్లు, గ్రాండియర్ లుక్ కోసం ఎక్కువ తాపత్రయపడ్డారు.

చిత్రం: ఎల్ 2 ఎంపురాన్ (లూసిఫర్ 2)
రేటింగ్ : 2.5/5
నటీనటులు: మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్, కిషోర్ తదితరులు..
కథ: మురళి గోపి
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
సంగీతం: దీపక్ దేవ్
నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్
దర్శకత్వం: పృధ్వీరాజ్ సుకుమారన్
విడుదల తేదీ: మార్చి 27, 2025

లూసిఫర్ సినిమాకు మలయాళంలోనే కాదు, తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి కూడా దాన్ని రీమేక్ చేశారు. అందుకే ఎల్ 2 ఎంపురాన్ – లూసిఫర్ 2 పై ఇక్కడ కూడా అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీశామని చెప్పుకొచ్చాడు దర్శక-నటుడు ఫృధ్వీరాజ్ సుకుమారన్. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకుమించి ఉంటుందన్నాడు. మరి ఈ సీక్వెల్ ఆ హైప్ ను నిలబెట్టిందా? తెరపై లూసిఫర్ మరోసారి మెస్మరైజ్ చేశాడో లేదో చూద్దాం.

కథ విదేశాల్లో మొదలవుతుంది. కోట్ల రూపాయల డ్రగ్స్ దందా చుట్టూ నడుస్తుంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసే ఖురేషి అబ్రామ్ (మోహన్ లాల్), విదేశీ గ్యాంగ్ స్టర్స్ తో పోరాటం చేస్తుంటాడు. మరోవైపు కేరళలో రాజకీయాలు మారిపోతాయి. ముఖ్యమంత్రి జతిన్ రామదాస్ (టొవినో థామస్) తండ్రి స్థాపించిన పార్టీని వీడి కొత్త పార్టీ పెడతాడు. ఉత్తరాదికి చెందిన భజరంగితో చేతులు కలుపుతాడు. డ్రగ్స్ రవాణాకు కేరళను అడ్డాగా మార్చాలనుకుంటారు. విదేశాల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖురేషి, మరోసారి లూసిఫర్ గా కేరళలో అడుగుపెడతాడు. లూసిఫర్ కు అనుచరుడిగా ఉన్న జాయెద్ మసూద్ (పృధ్వీరాజ్) కు బాబా భజరంగీకి ఏంటి సంబంధం.. లూసిఫర్ ఈ రాజకీయాలకు ఎలా చెక్ పెట్టాడు అనేది మిగతా స్టోరీ.

మలయాళం సంగతి కాసేపు పక్కనపెడదాం. ఆరేళ్ల కిందటొచ్చిన లూసిఫర్, తెలుగు ప్రేక్షకుల్ని ఎందుకు ఆకర్షించిందో ఓసారి చూద్దాం. ఆ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్. రాజకీయ ఎత్తుగడలకు తోడు, లూసిఫర్ అనే ఓ మిస్టరీ మేన్ ఆడించే ఆట ఆ సినిమాకు హైలెట్. కథ, దాన్ని నడిపించే విధానం (స్క్రీన్ ప్లే) తెలుగు ఆడియన్స్ కు నచ్చాయి. అవే అంశాలు ఇప్పుడు ఎల్ 2 ఎంపురాన్ లో మిస్సయ్యాయి.

లూసిఫర్ లో మలయాళీ సినిమా బలం కనిపిస్తుంది. ఎంపురాన్ లో ఆ బలాన్ని వదిలి చేసిన పాన్ ఇండియా ఫీట్లు కనిపిస్తాయి. అడుగడుగునా హీరో పాత్రధారి ఎలివేషన్లు, స్లో మోషన్లు రన్ టైమ్ ను తినేశాయి. ఇంకా చెప్పాలంటే దర్శకుడిపై తెలుగు, కన్నడలో వచ్చిన కొన్ని పాన్ ఇండియా సినిమాల ప్రభావం గట్టిగా పడింది. పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అవ్వాలంటే ఎలివేషన్స్, హింస ఉండాల్సిందే అన్నట్టు ఈ సినిమాలో సన్నివేశాలున్నాయి. దీంతో మాతృకను ఇష్టపడిన కల్ట్ ఫ్యాన్స్ ఇబ్బందిపడ్డారు.

సీక్వెల్ కోసం రాసుకున్న కథ బాగుంది. లూసిఫర్ లో మోహన్ లాల్ పాత్రను ఎక్కడ ముగించారో, ఎంపురాన్ (లూసిఫర్-2)ను అక్కడ్నుంచే మొదలుపెట్టారు. అయితే ప్రథమార్థం మొత్తం విదేశాల్లోనే నడుస్తుంది. ఒరిజినల్ కథకు సంబంధం లేకుండా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఫస్టాఫ్ కే లూసిఫర్ ను చనిపోయినట్టు చూపించి, సెకండాఫ్ లో తిరిగి అతడు బతికే ఉన్నాడని చెప్పడం దర్శకుడి టార్గెట్. ఇలాంటి సన్నివేశాలు, కథలు తెలుగు ప్రేక్షకుడికి కొత్త కాదు.

ఇలా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన పాయింట్ నే చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చిన చర్చి ఫైట్ లాంటి ఎపిసోడ్స్ కొన్ని బాగున్నప్పటికీ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది తొలిభాగం. సినిమా ప్రారంభమైన సరిగ్గా గంట వరకు మోహన్ లాల్ ఎంట్రీ లేదంటే, స్క్రీన్ ప్లే ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ గంటలో మనకు కనీసం పృధ్వీరాజ్ కూడా కనిపించడు. మొత్తానికి ఇంటర్వెల్ కు వచ్చేసరికి కథను గాడిలోకి తీసుకొచ్చారు.

ఒక్కో చిక్కుముడిని విప్పుతూ, సస్పెన్స్ రివీల్ చేస్తూ సెకెండాఫ్ నుంచి సినిమా గ్రిప్పింగ్ గా సాగింది. క్లయిమాక్స్ లో భారీ ఫైట్ పెట్టి మరోసారి విసుగు తెప్పించారు. ఓకే, అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో ఈ ఫ్రాంచైజీలో పార్ట్-3 కూడా ఉందనే విషయాన్ని చివర్లో సవివరంగా, సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, అసలు స్టీఫెన్ ఎవరు? అతడి బ్యాక్ స్టోరీ ఏంటనేది ఈ సినిమాలో చెప్పలేదు. ఇది పూర్తిగా పృధ్వీరాజ్ క్యారెక్టర్ చుట్టూ అల్లిన కథ.

పడుతూ లేస్తూ సాగిన ఎంపురాన్ లో మోహన్ లాల్ వన్ మేన్ షో సాగింది. మరోసారి తన శ్వాగ్ తో ఆకట్టుకున్నారు మోహన్ లాల్. క్రేజ్, పాపులారిటీ ఓ స్థాయిని దాటిన తర్వాత భారీ డైలాగ్ లు చెప్పనక్కర్లేదని, భారీ ఫైట్స్ చేయనక్కర్లేదనే విషయం ఈ సినిమాలో మోహన్ లాల్ ను చూస్తే అనిపిస్తుంది. ఆయన చూపు, నడక, ఒక్కోసారి నిశ్శబ్దం నుంచి కూడా ఆయన సన్నివేశాన్ని పండించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం.

టొవినో థామస్ పాత్రను సరిగ్గా రాసుకోలేదనిపించింది. అతడ్ని డైరక్ట్ గా నెగెటివ్ షేడ్స్ లో పరిచయం చేశారు. అతడలా మారడానికి కారణాల్ని చెప్పడానికి 3 గంటల సినిమాలో 2 నిమిషాలు కూడా కేటాయించలేకపోయారు. మంజు వారియర్ తన నటనతో ఆకట్టుకున్నారు. చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లిన సీన్ లో ఆమె బాగా హైలెట్ అయ్యారు. లూసిఫర్ లో కనిపించిన‌ నటులంతా పార్ట్-2లో కూడా ఉన్నారు. తమ పాత్రల్ని చేసుకుంటూపోయారు.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. ఎంచుకున్న లొకేషన్లు, వాటిని స్క్రీన్ పై చూపించిన విధానం కొత్తగా ఉంది. ఫస్టాఫ్ సాగదీసినట్టు అనిపించినా కూర్చోబెట్టగలిగిందంటే దానికి కారణం సినిమాటోగ్రఫీ. ఇంటర్వెల్ ఎపిసోడ్, చర్చి ఫైట్, ఫారెస్ట్ ఫైట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. క్లైయిమాక్స్ లో బీజీఎం ఆశించిన స్థాయిలో లేదు.

పాన్ ఇండియా సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. మలయాళం బోర్డులు, మలయాళంలో రాసిన ఉత్తరాన్ని అలానే ఉంచేశారు. తెలుగులో చూపించే ప్రయత్నం చేయలేదు.

మొత్తంగా చూసుకుంటే లూసిఫర్-2 కథా పరంగా కొత్తదేం కాదు. ఇందులో ట్విస్టులు, హీరో ఎలివేషన్లు తెలుగు ప్రేక్షకులకు అస్సలు కొత్త కాదు. కంటెంట్ కంటే ఎలివేషన్లు, గ్రాండియర్ లుక్ కోసం ఎక్కువ తాపత్రయపడ్డారు. మోహన్ లాల్ నటన, గ్రాండ్ విజువల్స్ కోసం కాస్త ఓపికపట్టి ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

బాటమ్ లైన్ – పాన్ ఇండియా పాట్లు

12 Replies to “L2 Empuraan Review: మూవీ రివ్యూ: ఎల్ 2 ఎంపురాన్(లూసిఫర్ 2)”

    1. న్యూడ్ వీడియో కాల్ >>> తొమ్మిది, సున్నా, ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

      1. కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

    2. @@@vc తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  1. కాల్ ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.