డిప్యూటీ మేయర్లు అంత మందా?

వైసీపీ మేయర్ ని దించడం అన్న ఏకైక అజెండా ఫలిస్తుందా లేక పదవుల పందేరంలో కూటమిలో లుకలుకలు బయటపడతాయా అన్నది ఆలోచిస్తున్నారు.

విశాఖ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం అందుకోవడానికి చూస్తోంది. దానికోసమే వైసీపీ మేయర్ మీద అవిశ్వాసం ప్రవేశపెట్టారు. అది కనుక నెగ్గితే టీడీపీ నుంచి మేయర్ అవుతారు. ఇందులో ఎవరికీ ఏ డౌటూ లేదు. అయితే మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్లు ఎంత మంది అన్నదే కూటమిలో అంతా డిస్కషన్ చేస్తున్నారు. రేసులో ఏకంగా డజన్ కి పైగా ఆశావహులు ఉన్నారన్న వార్తలు రాజకీయంగా వేడిని పుట్టిస్తున్నాయి.

ఒక్కో అభ్యర్థి వెనక బడా నాయకులు ఉంటున్నారు. పార్టీలు కూడా ఉంటున్నాయి. మామూలుగా అయితే మేయర్ పదవిని టీడీపీ తీసుకుని డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాలని అనుకుంటోంది. కానీ బీజేపీ నుంచి కూడా పోటీ ఉంది. అంతే కాదు తెలుగుదేశం నుంచి చాలా మంది ఉత్సాహవంతులు డిప్యూటీ మేయర్ పదవి కోసం గేలం వేస్తున్నారు.

వారు తమకు సన్నిహితులైన ఎమ్మెల్యేల ద్వారా రికమెండ్ చేయించుకుంటున్నారుట. దాంతో డిప్యూటీ మేయర్ల సంఖ్య కొండవీటి చాంతాడు అంతగా పెరిగిపోతోంది అంటున్నారు. తమకు డిప్యూటీ హోదా ఇవ్వకపోతే ఓటేసే విషయం ఆలోచిస్తామని కొంతమంది కార్పోరేటర్లు వేరే టోన్ లో తన సన్నిహితులతో చెబుతూండడం కూడా కూటమి నేతలను కలవరపెడుతోందిట.

వైసీపీకి చెందిన కార్పోరేటర్లు అయితే బెంగళూరు లో క్యాంప్ ని స్టార్ట్ చేశారు. పదవుల దగ్గరకు వచ్చేసరికి కూటమిలో వివాదాలు ఉంటాయని అవి కొలిక్కి రావడం కష్టమని వైసీపీ నమ్ముతోందిట. ఈ అవిశ్వాసం నెగ్గేది కాదు వీగిపోయేదే అని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారని చెబుతున్నారు.

అయిదేళ్ళ పాటు మేమే మేయర్ పదవిలో కొనసాగుతామని ఆ పార్టీ వారు అంటున్నారు. పదవుల విషయంలో ఎవరికి వారు వెనక్కి తగ్గకపోగా ఓటేస్తే మాకేంటి అన్న ధోరణిలో ఉండడంతో కూటమిలో కొంత అనిశ్చితి ఉందని అంటున్నారు. జనసేన టీడీపీల మధ్య కో ఆర్డినేషన్ మీటింగ్ కూడా ఈ విషయంలో జరగలేదని అంటున్నారు. ఇవన్నీ చూస్తున్న వారు వైసీపీ మేయర్ ని దించడం అన్న ఏకైక అజెండా ఫలిస్తుందా లేక పదవుల పందేరంలో కూటమిలో లుకలుకలు బయటపడతాయా అన్నది ఆలోచిస్తున్నారు.

6 Replies to “డిప్యూటీ మేయర్లు అంత మందా?”

    1. 160 paiga unnaru tdp pandulu , inka Janaserna tikka bayalu.. Emi ayina peeks raa jagan ni?

      maha ante Just mlc ni laagutunnaru..idi elagu govt change lo jarigedi..

      andukani musukuni tdp kukka biscotti tini vongo .. extra vesthe telusugu gaa .. assam gathi..

  1. 160 paiga unnaru tdp pandulu , inka Janaserna tikka bayalu.. Emi ayina peeks raa jagan ni?

    maha ante Just mlc ni laagutunnaru..idi elagu govt change lo jarigedi..

    andukani musukuni tdp kukka biscotti tini vongo .. extra vesthe telusugu gaa .. assam gathi..

  2. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.