ప‌వ‌న్‌ను నిల‌దీసిన జ‌గ‌న్‌!

దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ప్ర‌త్యేకంగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిల‌దీశారు. అలాగే కూట‌మి పాల‌న‌లో హిందూ ధ‌ర్మంపైన‌, ఆల‌యాల‌పైన జ‌రుగుతున్న దాడుల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. త‌మ హ‌యాంలో ఏ విధంగా హిందూ ధ‌ర్మాన్ని కాపాడారో ఆధారాల‌తో స‌హా సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఎక్స్‌లో జ‌గ‌న్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆ పోస్టుతో పాటు త‌మ హ‌యాంలో ఆల‌యాల ప‌రిర‌క్ష‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌ల‌కి సంబంధించిన ఆదేశాల‌ను ఆధారాల‌తో స‌హా షేర్ చేశారు.

వైఎస్ జ‌గ‌న్ సుదీర్ఘ పోస్టులోని ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం.

“దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?

తామే ఉత్తర్వులిచ్చి, తమ చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ల తీరే అంత? ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమనుతాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా?” అని జ‌గ‌న్ నిల‌దీశారు.

కాశినాయ‌న క్షేత్రంలో అన్న‌దాన స‌త్రాల కూల్చివేత‌ల్ని ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ముఖ్యంగా స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడిగా త‌న‌ను తాను ప్ర‌చారం చేసుకుంటున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… త‌న చేతిలోని అట‌వీశాఖ అధికారులే కాశినాయ‌న‌లో కూల్చివేయ‌గా, ఇంత వ‌ర‌కూ నోరు మెద‌ప‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లొచ్చాయి. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఆయ‌న్ను ప్ర‌శ్నించారు. స‌మాధానం ఏంటో మ‌రి!

49 Replies to “ప‌వ‌న్‌ను నిల‌దీసిన జ‌గ‌న్‌!”

  1. Abey Jaglak..

    హిందువులు,హిందూ క్షేత్రాల మీద దాడి చేసారు అని రుద్దితే జనాలు ఎలా నమ్ముతాraaa..చేస్తే గీస్తే నీలాంటి పర మతస్థులు చేస్తారు గానీ?

    1. నువ్వు ఎన్ని నీతులు దెంగిన హిందువు అనేవాడు నిన్ను నమ్మడు. Life time membership నీకు అది. అన్ని చేశాను అని మాటలు దెంగుతున్నావు కదా? తిరుమల లో ఎప్పుడూ అయిన తల నీలాలు ఇచ్చిందా నీ కుటుంబం? మూసుకుని బెంగళూర్ దెంగెయ్యి Laila jumping ki ready akkada

      1. జగన్ అంటే క్రిస్టియన్ కాబట్టి ఇవ్వలేదు…. బట్ బాబోరు , పవనాలు… అపోలిటికల్ సనాతని లు కదా.. ? ఎన్ని సార్లు గుండు కొట్టారేంటి? అదే కొట్టించుకొన్నారేంటి? జగన్ అంటే క్రిస్టియన్ కాబట్టి ఇవ్వలేదు…. బట్ బాబోరు , పవనాలు… అపోలిటికల్ సనాతని లు కదా.. ? ఎన్ని సార్లు గుండు కొట్టారేంటి? అదే కొట్టించుకొన్నారేంటి?

  2. దీనినే అంటారు “దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరగటం” అని. కాశినాయన క్షేత్రాన్ని పడగొట్టడం, ప్రభుత్వం తరుపున లోకేష్ స్పందించి క్షమాపణ చెప్పటం, దానిని పునః నిర్మించటం జరిగిపోయి దాదాపు నెలరోజులు అవుతుంది. ఈయన ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి ఏ మాత్రం స్పందించారో ప్రజలందరూ చూసారు. తనకి తాను సరిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు.

    1. అన్నకి టైం కి స్క్రిప్ట్ రాసి ఇవ్వలేదు…. కాశి నాయన క్షేత్రానికి ఈయన సొంత జిల్లాలో ఉంది కడపలో…. ఈయన కానీ ఈయన కుటుంబ సభ్యులు కానీ సొంత జిల్లాలో ఉన్న జ్యోతి క్షేత్రానికి ఒక్కసారి అన్న వెళ్లాడా…. డొనేషన్స్ మీద నడిచే అన్నదాన సత్రం వైస్ కుటుంబ సభ్యులు అన్నదాన సత్రానికి రూపాయి అన్న ఇచ్చారా….స్క్రిప్ట్ ఎవ్వరో రాసి ఇవ్వగానే నిద్ర లేచాడు

  3. ఒకప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీ గారి కన్నా నేనే ఎక్కువ సనాతన ధర్మం ఆచరించేవాడిని అని చూపించడానికి గుడులు గోపురాలు తిరిగారు…. అయినా ప్రజలు నమ్మలే….ఆ తర్వాత మానేసాడు…. బీజేపీ తో కూడిన కూటమి కన్నా నేనే ఎక్కువ సనాతనీ అని చెప్పుకుంటే ఆ పోటీలో నెగ్గే పనేనా జగన్…. ఎవ్వడు ఈ పనికి మాలిన ఆలోచనలు ఇచ్చేది…. హిందువులు మతం ప్రతిపాదికిన ఒకరిని ఓన్ చేసుకోవాలి అంటే కూటమిని చేసుకుంటారు కానీ వైకాపాని కాదు… మనం ఉచిత పధకాల గురించి చెప్పుకోవాలి అంతవరకే, అభివృద్ధి, సనాతన ధర్మం అనకూడదు…. సెట్ అవ్వవు….

    1. Ante mee vaadiki vadivi vaadu peekovadam kuda chetakaadaa vaadi sansklemam kosam manchi anubhavam unna Santana sukanya ni oka vanta kaani oka araganta kaani class istaremo kanukkundam payment elagola government sardubaatu chestundile

  4. మతం మారి , ఇంకా ఆ హిందూ మతం వలన వచ్చినే పేరుతో బడాయి కొడుతున్న ప్యాలెస్ పులకేశి వాటికన్ గొర్రె బిడ్డ కి హిం*దూ పెం*ట తింటున్నాడు రోజు. సిగ్గు వింటే హిందూ పేరు వదిలేసి వాటికన్ పేరు పెట్టుకోవాలి దావీదు అని.

  5. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.