మ్యాడ్.. రాబిన్ హుడ్.. ప్లస్ లూ మైనస్ లూ!

రాబిన్ హుడ్ కు మ్యాడ్ 2 కు వున్న తేడా ఏమిటంటే, రాబిన్ హుడ్ పక్కాగా అన్ని విధాలా బాగుంది అనిపించుకుని తీరాలి. మ్యాడ్ 2,, అలా అలా వెళ్లిపోతే సరిపోతుంది.

మరో కొన్ని గంటల్లో పోటా పోటీగా ప్రచారం నిర్వహించిన రెండు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. టాలీవుడ్ లోని రెండు పెద్ద సంస్థలు మైత్రీ, సితార నిర్మించిన సినిమాలు. రాబిన్ హుడ్, మ్యాడ్ 2. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. ఎలా వుంటాయన్నది విడుదల తరువాత తెలుస్తుంది. ఎలా వుండబోతున్నాయి, బలాలు, బలహీనతలు చూస్తే.

రాబిన్ హుడ్. వరుసగా రెండు హిట్ లు కొట్టిన దర్శకుడు వెంకీ కుడుమల. మైత్రీ సంస్థ నిర్మాణం. భారీ ఖర్చు, విజువల్ గా కలర్ ఫుల్ గా వుండే సినిమా. గ్లామర్ టచ్ ఇచ్చేందుకు శ్రీలీల, కేతిక శర్మ. రెండు పాటలు బాగున్నాయి. గట్టిగా వైరల్ అయ్యాయి కూడా. వెంకీ కుడుమల ఎంటర్ టైన్ మెంట్ పాళ్లు బాగా అందిస్తారనే నమ్మకం వుంది. దానికి తగినట్లే రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు వున్నారు. హిట్ కోసం కసిగా వర్క్ చేస్తున్న హీరో నితిన్, ఈ సినిమా ప్రచారానికి బాగా కష్టపడ్డారు. నితిన్ కెరీర్ లోనే ఇంతలా ప్రచారం నిర్విహించిన సినిమా మరోటి లేదు.

కానీ, అయితే భారీ ఈవెంట్ సినిమాలు లేదంటే ఎంటర్ టైన్ మెంట్, లేదా థ్రిల్ అందించే చిన్న సినిమాలు ఆదరిస్తున్నట్లు, మిడ్ రేంజ్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. అదొక్కటే ఈ సినిమాకు మైనస్. ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేయని కథ, కథనం, ట్విస్ట్ లు సినిమాలో వుండాలి. అప్పుడే జనం ఈ సినిమాకు జేజేలు కొడతారు. అలాగే వుంటుందని దర్శకుడు వెంకీ కుడుమల బలంగా చెబుతున్నారు. అదెంత వరకు ప్రూవ్ అవుతుందో వెయిట్ అండ్ సీ.

సితార సంస్థ అందిస్తున్న సినిమా మ్యాడ్ 2. సీక్వెల్ అడ్వాంటేజ్ బలంగా తీసుకుంటున్న సినిమా ఇది. లెగసీ కంటిన్యూ అన్నట్లుగా తొలి భాగం తెచ్చుకున్న ఇమేజ్ ఈ రెండో భాగానికి ప్లస్. జాతిరత్నాలు సినిమా మాదిరిగా ఏ సీన్ కు ఆ సీన్ నవ్వేసుకుంటే చాలు. అలా నవ్వుకునేందుకు వీలుగా, సీన్లు రాసుకోవడానికి చిన్న థ్రెడ్ వుంటే సరిపోతుంది. కుర్రాళ్లు కావడం, పెద్దగా అంచనాలు లేకపోవడం, జస్ట్ అల్లరి సినిమా అనే విషయాన్ని క్లారిటీగా ముందే చెప్పేసి ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం అన్నది అడ్వాంటేజ్.

అయితే ఎంత అల్లరి సినిమా అయినా, సీన్ టు సీన్ నవ్వించుకుంటూ వెళ్లిపోయినా, మరీ విషయం లేకుండా జస్ట్ నవ్వులే వుంటే సరిపోతుందా అన్నది చూడాలి. కేవలం సీన్లతో జబర్దస్ట్ మాదిరిగా సాగిపోతే జనం యాక్సెప్ట్ చేస్తారా అన్నిది పాయింట్.

అయితే రాబిన్ హుడ్ కు మ్యాడ్ 2 కు వున్న తేడా ఏమిటంటే, రాబిన్ హుడ్ పక్కాగా అన్ని విధాలా బాగుంది అనిపించుకుని తీరాలి. మ్యాడ్ 2,, అలా అలా వెళ్లిపోతే సరిపోతుంది. ఎందుకంటే వాటి వాటి జానర్లు అలాంటివి. అంతకు మించి కాదు.

8 Replies to “మ్యాడ్.. రాబిన్ హుడ్.. ప్లస్ లూ మైనస్ లూ!”

  1. thu buradalo pandi vundi alage ee site owner , emiti thoka vundi elevations . vadu oka hero malli nee elevation

    l 1 1 avutundi , like 1 7 5 / 1 7 5

  2. Movie shooting start Aina ventane review raseyara Nuvvu, media musugu lo vyabhicharam chestunnattu vundi, yedi anipiste adi raseyadam. Neeku kinda dammu vunte Prajala samasyala kosam rayu, lekapote moosukoni kurcho.

  3. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.