బాబు మెప్పుకోసం.. ముప్పు కొని తెచ్చుకున్నారు!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మెప్పుకోసం ఎన్నిక‌ల అధికారులు స‌మ‌స్య‌ను కొని తెచ్చుకున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మెప్పుకోసం ఎన్నిక‌ల అధికారులు స‌మ‌స్య‌ను కొని తెచ్చుకున్నారు. కోరం లేకుండానే ఎంపీపీగా కూట‌మి బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థిని ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చంద్ర‌బాబునాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని రామ‌కుప్పం ఎంపీపీ స్థానానికి గురువారం ఎన్నిక నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది.

రామ‌కుప్పం ఎంపీపీ శాంత‌కుమారి మృతితో ఎన్నిక అనివార్య‌మైంది. ఈ మండ‌ల ప‌రిధిలోని 16 ఎంపీటీసీ స్థానాల్ని గ‌తంలో వైసీపీ గెలుచుకుంది. కూట‌మి అధికారంలోకి రావ‌డంతో స్థానిక సంస్థ‌ల‌పై కన్నేశారు. ఇందులో భాగంగా చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రామ‌కుప్పం ఎంపీపీ స్థానానికి ఉప ఎన్నిక రావడం, ఎలాగైనా సొంతం చేసుకోవాల‌ని టీడీపీ ప‌ట్టు పట్టింది. అయితే ఒక్క‌టంటే ఒక్క ఎంపీటీసీ కూడా లేని టీడీపీ ఎంపీపీ స్థానాన్ని ఆశించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది.

ఈ నేప‌థ్యంలో న‌యాన్నో, భ‌యాన్నో ఏడుగురిని త‌మ‌వైపు తిప్పుకుంది. మిగిలిన 8 మంది ఎంపీటీసీ స‌భ్యులు వైసీసీ వైపే నిలిచారు. అయితే ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా అడ్డుకుంటార‌నే భ‌యంతో ఎమ్మెల్సీ, కుప్పం వైసీపీ ఇన్‌చార్జ్ భ‌ర‌త్ హైకోర్టును ఆశ్ర‌యించారు. వైసీపీ స‌భ్యులు స్వేచ్ఛ‌గా ఓటు హ‌క్కు వినియోగించుకునేలా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని చిత్తూరు జిల్లా పోలీస్ అధికారుల్ని హైకోర్టు ఆదేశించింది.

వైసీపీ ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ‌స్సులో పోలీసుల ర‌క్ష‌ణ మ‌ధ్య రామ‌కుప్పం బ‌య‌ల్దేరారు. వైసీపీ ఎంపీటీసీలు ప్ర‌యాణిస్తున్న బ‌స్సును క‌ర్నాట‌క స‌రిహ‌ద్దుల్లోని రాజుపేట రోడ్ క్రాస్ వ‌ద్ద టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. సుమారు గంట‌సేపు వాహ‌నాన్ని ముందుకు క‌ద‌ల‌నివ్వ‌లేదు. క‌నీసం 8 మంది ఎంపీటీసీ స‌భ్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని గొప్ప పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ సాక్ష్యాత్తు సీఎం చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం రామ‌కుప్పం ఎంపీపీ ఎపిసోడ్‌లో ప్ర‌జానీకం చూసింది.

ఎన్నిక జ‌ర‌గాలంటే క‌నీసం 8 మంది స‌భ్యులుండాలి. వైసీపీకి చెందిన 8 మంది స‌భ్యులు లేకుండానే, ఎన్నిక నిర్వ‌హించ‌డం రామ‌కుప్పం ఎంపీపీ ఎన్నిక ప్ర‌త్యేక‌త‌. కేవ‌లం ఏడుగురు కూట‌మి మ‌ద్ద‌తుదారుల‌తోనే ఎంపీపీ ఎన్నిక‌ను సంబంధిత అధికారులు మ‌మ అనిపించారు. త‌ద్వారా సీఎం చంద్ర‌బాబు గుడ్‌లుక్స్‌లో ప‌డేందుకు ఎన్నిక‌ల అధికారులు శ్ర‌మ‌టోడ్చారు.

అయితే ఈ వ్య‌వ‌హారాన్ని వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. కోరం లేకుండానే ఎన్నిక నిర్వ‌హించ‌డంతో పాటు హైకోర్టు ఆదేశించినా ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోవ‌డంపై వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధ‌మ‌వుతోంది. బ‌స్సులో 8 మంది వైసీపీ స‌భ్యులుండ‌గా, కోరం లేద‌ని తెలిసి కూడా ఎంపీపీగా టీడీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంపై ఎన్నిక‌ల అధికారులు న్యాయ స్థానానికి స‌మాధానం చెప్పుకోవాల్సి వుంటుంది. ఈ ప‌రిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.

4 Replies to “బాబు మెప్పుకోసం.. ముప్పు కొని తెచ్చుకున్నారు!”

  1. స్వాతంత్రం వచ్చినప్పుటినుండి పులివెందులని ఈడి తాత, తాత తర్వాత అబ్బ, అబ్బ తర్వాత ఈడు ఇలా ఒకరితర్వాత ఒకరు ఏళ్లుగా ప్రజలని భయపెట్టి మీరే ఎలుతున్నారు కదరా.. కానీ ఇంతవరకు ఒక్క డ్యామ్ కట్టడం కానీ, కాలువ తవ్వి కనీసం ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదు కదరా.. తూ

    పులివెందులకి ఈడీ అచీవ్మెంట్ ఏందయ్యా అంటే??.

    చెబితే మీరు నవ్వుతారు.. అందుకే “చెప్పను బ్రదర్”

Comments are closed.