పెద్ది గ్లింప్స్ లేనట్టే..!

ఫస్ట్ లుక్ తో పాటు విడుదల తేదీని కూడా రివీల్ చేస్తామని నిన్న నిర్మాత ప్రకటించాడు. కట్ చేస్తే, ఈరోజు విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఎప్పట్నుంచో అనుకుంటున్నది, అంతా ఊహించిన టైటిలే ఇది.

కాబట్టి టైటిల్ కంటే ముఖ్యంగా 2 అంశాలపై మెగా ఫ్యాన్స్ దృష్టి పెట్టారు. ఒకటి చరణ్ ఫస్ట్ లుక్, రెండోది గ్లింప్స్. వీటిలో ఒకటి ఈరోజు రిలీజైంది. లెక్కప్రకారం గ్లింప్స్ కూడా రావాలి. కానీ అది ఈరోజు రిలీజయ్యేలా లేదు.

షెడ్యూల్ ప్రకారం, ఉదయం ఫస్ట్ లుక్, సాయంత్రం గ్లింప్స్ అనుకున్నారు. కానీ ఆ వీడియోలో ఆడియో ప్రాబ్లమ్ తలెత్తిందని నిన్ననే నిర్మాత రవిశంకర్ చెప్పారు. దీంతో ఈరోజు సాయంత్రానికి అది పరిష్కారమౌతుందని, గ్లింప్స్ వస్తుందని అంతా ఎదురుచూసారు.

కానీ ఈరోజు గ్లింప్స్ రిలీజయ్యే అవకాశాలు చాలా తక్కువ. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాదికి ‘పెద్ది గ్లింప్స్’ రిలీజ్ అవుతుంది. ఈరోజు మెగా ఫ్యాన్స్ కు మరో చిన్న నిరాశ కూడా ఎదురైంది.

ఫస్ట్ లుక్ తో పాటు విడుదల తేదీని కూడా రివీల్ చేస్తామని నిన్న నిర్మాత ప్రకటించాడు. కట్ చేస్తే, ఈరోజు విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు. బహుశా, గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి.

ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే, పక్కా మాస్ లుక్ లో చరణ్ ను ప్రజెట్ చేశాడు బుచ్చిబాబు. నోట్లో బీడీ, ముక్కుకి రింగ్, గుబురు గడ్డంతో ఊర మాస్ లుక్ లో కనిపించాడు రామ్ చరణ్.

7 Replies to “పెద్ది గ్లింప్స్ లేనట్టే..!”

Comments are closed.