లైన్ క్లియర్ అయింది.. కాస్త క్రేజ్ కూడా పోయింది

సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఉన్న హైప్ కూడా పోయింది

కొన్ని సినిమాలంతే. రాంగ్ టైమ్ లో రిలీజ్ అవుతాయి, ఎంత ట్రై చేసినా బజ్ రాదు, ఎంత లేపినా ఊపందుకోదు.. దీనికితోడు షోలు రద్దయ్యాయంటే, ఇక ఆ సినిమాను కాపాడ్డం ఎవ్వరితరం కాదు. విక్రమ్ హీరోగా నటించిన వీరధీరశూర సినిమా విషయంలో ఇదే జరిగింది.

ఈ సినిమాపై తెలుగులో పెద్దగా బజ్ లేదు. అయినప్పటికీ విక్రమ్ కష్టపడ్డాడు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంతా సెట్ అనుకున్న టైమ్ లో ఈరోజు ఉదయం పడాల్సిన మార్నింగ్ షోలు రద్దయ్యాయి.

డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా షోలు క్యాన్సిల్ అయ్యాయి. అప్పటికప్పుడు ఆఘమేఘాల మీద అన్నీ క్లియర్ చేశారు. ఈ క్రమంలో మ్యాట్నీ షోలు కూడా రద్దయ్యాయి. చివరికి ఈవినింగ్ షోల నుంచి సినిమాను రిలీజ్ చేశారు.

సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఉన్న హైప్ కూడా పోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 30శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించడం లేదు. చూస్తుంటే, చాలా సెంటర్లలో ఈవినింగ్ షోలు కూడా రద్దయ్యేలా ఉన్నాయి. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది.

2 Replies to “లైన్ క్లియర్ అయింది.. కాస్త క్రేజ్ కూడా పోయింది”

  1. Chinna and bichhagaadu movies ki kudaa release time lo hype ledu em ledu…but Tarvata content bagundadamtho long run lo blockbusters ayyayi..

    Ee madhya entho hype tho vachina movies bokka borla paddayi content lekapovadamtho

Comments are closed.