ఆదిత్య 369కు సీక్వెల్ తీస్తానని ఎప్పట్నుంచో ప్రకటిస్తున్నారు బాలకృష్ణ. అదిప్పటివరకు కార్యరూలం దాల్చలేదు. తాజాగా మరోసారి సేమ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ క్లారిటీ లేదు. ఆయన ఎప్పుడు తీస్తారో ఆయనకే తెలియదు కానీ, ఇప్పుడు తీస్తే మాత్రం ఇదే సరైన సమయం అంటున్నారు అభిమానులు.
ఐదేళ్ల కిందటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. సీక్వెల్స్ కు పూర్తి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. కాబట్టి ఆదిత్య-369కు సీక్వెల్ తీయాలంటే ఇదే సరైన టైమ్. ఇక బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని కోరుతున్నారు అతడి ఫ్యాన్స్.
అయితే బాలయ్య మాత్రం ఎప్పట్లానే ఈసారి కూడా దాటేశారు. ఆదిత్య-369 సీక్వెల్ కథను ఒక్క రాత్రిలో పూర్తిచేశామని ప్రకటించిన ఈ సీనియర్ నటుడు, కథ బాగా వచ్చిందని, ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అనే ఆత్రుతలో ఉన్నానని మాత్రమే అన్నారు. అంతే, అంతకుమించి ఇంకేం చెప్పలేదు.
“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ను స్వయంగా బాలకృష్ణే గతంలో ప్రకటించారు. తనే డైరక్ట్ చేస్తానని ఒక దశలో తనకుతానుగా ప్రకటించుకున్నారు. కొడుకు మోక్షు ఇందులో నటించే అవకాశం ఉందంటూ ఫీలర్లు కూడా వదిలారు. కానీ ప్రాజెక్టు మాత్రం ముందుకు కదల్లేదు.
ఇలా ఆరేళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాదిలోనైనా బాలయ్య ఈ సీక్వెల్ ను స్టార్ట్ చేస్తారేమో చూడాలి.
Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4
Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc
Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y
Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig
Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE
JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40
AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY
Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg
కల్ట్ క్లాసిక్ అయిన ఈ చిత్రాన్ని అనవసరంగా సీక్వెల్ పేరుతో చెడగొట్టడం కంటే వదిలేయడం చాలా ఉత్తమం
Aditya369 should be released now pan India in all 5 languages
ఇంట్రెస్ట్ ఉంటే నా డీపీ చూడండి