ఆహారం అంటే.. అది శారీరక ఆరోగ్యాన్ని నియంత్రించేది అనేది ఇప్పుడు సామాజికంగా ఒప్పుకుంటున్న సత్యం. మాతాతలూ తండ్రులు తోచింది తిని సుఖవంతంగా బతికేశారు అనడం తేలికే కానీ, అయితే దూరపు కొండలు నునుపు అన్నట్టుగా గతం గురించి కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటాయి మనకు! అందునా కొన్ని చేదు నిజాలను పక్కన పెట్టేస్తాం! బ్రిటీష్ వారు ఇండియాను ఖాళీ చేసే నాటికి భారతీయుల సగటు ఆయుష్షు 33 సంవత్సరాలు మాత్రమే! అంటే 75 యేళ్ల కిందటి పరిస్థితి అది! మరి తోచింది తిని, అవిశ్రాంతంగా పని చేసే రోజుల్లో కూడా సగటు ఆయురార్దం అంత తక్కువగా ఉందంటే .. గతంతో పోలిస్తే ఇప్పుడు మనిషి సగటు ఆయష్షు ఎంత పెరిగిందో లెక్కబెట్టుకోవచ్చు!
ఇలా చెబితే అప్పుడు వైద్య సౌకర్యాలు తక్కువ కదా, అలాగే శిశుమరణాల రేటు కూడా ఎక్కువ కదా అనొచ్చు! మరి నాటి ఆహారపు అలవాట్ల ప్రకారం మనిషి జబ్బు పడనే కూడదు కదా… జబ్బు పడినప్పుడు కదా వైద్య సౌకర్యాల చర్చ! కాబట్టి.. పోషహాకారం అనేది మనిషి మనుగడకు చాలా కీలకం! బ్రిటీష్ ఇండియాలో భారతీయులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యారు. పంటలు పండించడంలో కూడా బ్రిటీషర్ల స్వార్థమే పని చేసింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. కరువులు తాండవం చేశాయి.
స్వతంత్రం తర్వాత స్వేచ్ఛ లభించింది. కావాల్సింది, దేశ అవసరాలకు తగినది పండించుకోవడం మొదలైంది, క్రమక్రమంగా భారతీయులు ఆహారం విషయంలో శ్రద్ద వహిస్తూ వచ్చారు. నాణ్యమైన ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. ఇలా చెబితే.. మళ్లీ జంక్ తింటున్నారు కదా, ప్లాస్టిక్ కంటైనర్లలో తింటున్నారు కదా, అల్యూమినియం వంట పాత్రల్లో తింటున్నారు కదా.. అదంతా నాణ్యమైన ఆహారమా అనే వాదనా తీస్తారు. సైంటిఫిక్ చర్చ గురించి కాదు, ఇక్కడ! గంజివార్చిన అన్నం తింటున్నారా, లేదా గంజి వార్చని అన్నం తింటున్నారా అనేది కాదు.. భారతీయుల వినియోగం పెరిగింది. ఆకలి చావులు తగ్గాయి. ఆఖరికి దొడ్డు బియ్యం అన్నం తినడానికి కూడా జనాలు వెనుకాడుతున్నారు. తమకు అరడం లేదని, బీపీటీలు, సోనామసూరీనే కావాలని గ్రామాల్లో సైతం చాలామంది మొహమాటం లేకుండా చెబుతున్నారు.
దశాబ్దంన్నర కిందటి వరకూ ఆర్ఎన్ఆర్ వంటి దొడ్డు బియ్యాన్ని రైతులు పండించేవారు తెలుగునాట. అది వందరోజుల్లో పూర్తయ్యే వరి పంట. అయితే ఇప్పుడు లావుపాటి బియ్యం రకాలను నాటే రైతు తెలుగునాట కనిపించడం లేదు. బీపీటీలు, సోనామసూరిల వరి రకం పంట పూర్తి కావడానికి అటు ఇటుగా ఐదు నెలల సమయం పడుతుంది. లావుపాటి రకం కంటే.. వీటికి నీటి అవసరం రెండు నెలల పాటు అధికంగా అవసరం అవుతుంది. అయినా.. రైతులు కూడా లెక్క చేయడం లేదు. ఇంటి అవసరాల కోసం వరి నాటే వారు అయినా, లేదా బియ్యం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో వరిని సాగు చేసే వారు అయినా సన్న రకాలనే నాటుతున్నారు. ఇక స్టోరు బియ్యాలను వాడే నాథులు తెలుగునాట అరుదైపోతున్నారు!
పట్టణాల్లో పేదలు అయినా కాస్త దొడ్డు బియ్యం అన్నం తింటారేమో కానీ, గ్రామాల్లో ఇప్పుడు స్టోరు బియ్యాలను తినడం అనేది జస్ట్ కక్కుర్తి అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం లావు బియ్యాలను స్టోర్ లతో ఇస్తోంది. అయితే.. వాటిని తీసుకునే వైట్ కార్డు హోల్డర్లు ఎంత శాతం మంది వాటితో అన్నం వండుకుంటున్నారు అంటే.. బహుశా ఏ పది శాతం లోపు కావొచ్చు! మిగిలిన వారంతా వాటిని అమ్ముకుంటూ ఉన్నారు. అక్కడకూ స్టోర్ బియ్యాలను బయట అమ్మకూడదని ప్రభుత్వమే నిషేధం పెట్టింది. దశాబ్దం కిందటే ఈ చట్టం చేశారు. స్టోర్ బియ్యాన్ని అనధికారికంగా తరలించేవారిని తనిఖీలు చేసి పట్టుకుంటూ వస్తూ ఉన్నారు.
ప్రభుత్వం రూపాయికి, రెండు రూపాయలకు ఇచ్చే బియ్యాన్ని.. కిలో పది రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు వైట్ కార్డు హోల్డర్ లు. ఆ ధర కూడా పెరిగింది. బహిరంగ మార్కెట్ లో సోనామసూరి రకాలు రీటెయిల్ లో ధర కిలో యాభై రూపాయల వరకూ ఉంది. బల్క్ మీద కొంటే.. ఆ ధర మరింత తగ్గుతుంది. రోజూ తినే అన్నం కోసం ఆ మాత్రం ఖర్చు చేయడానికి తెలుగు వాళ్లు అయితే వెనుకాడటం లేదు.
ఇరవై యేళ్ల క్రితం స్కూళ్లకు భోజనం క్యారీలు తీసుకెళ్తే.. సన్న బియ్యం అన్నం తెచ్చుకునే వారు అరుదుగా కనిపించేవారు! అయితే ఇప్పుడు లావుపాటి బియ్యంతో అన్నం వండుకు తీసుకెళ్లే వాళ్లు అరుదయ్యారు! కనీసం భారతీయులు, అందునా తెలుగు వాళ్లు తమకు ఒకప్పుడు రిచ్ నెస్ కు తార్కాణంగా నిలిచిన సన్నబియ్యం అన్నాన్ని దర్జాగా తినగలుగుతున్నారు. ఇది పాతికేళ్లలో సాధించిన గొప్ప అభివృద్ధి అనుకోవాలి!
అన్నం తర్వాత కూరల సంగతికి వస్తే.. ఈ విషయంలో కూడా వైవిధ్యం బాగా పెరిగింది. టౌన్లలో పెరిగిన వాళ్లకు ఈ తేడాలు ఏ మేరకు తెలుసో కానీ.. వారాంతపు సంతల్లో కాయగూరలు కొనడం కూడా పల్లెలకు పెద్ద అలవాటు లేదు పాతికేళ్ల కిందట వరకూ. అయితే అప్పుడు పెరడుల్లోనే కొంత మేర కాయగూరలు పండించుకునే వారు. మిరపకాయలు, టమోటాలు, బీరకాయలు, చిక్కుడు కాయలు.. ఇలాంటి కూరగాయలు ఏ ఇంటి వద్ద అయినా కనిపించేవి గ్రామాల్లో. ఇక పొలాల్లో.. కూడా ఇంటి అవసరాలకు తగ్గట్టుగా కాయగూరల సాగు నిరంతరంగా సాగేది. అయితే ఇప్పుడు గ్రామాల్లో వీలైతే కమర్షియల్ గా కాయగూరల సాగు సాగుతోంది కానీ, పెరడులలో కాయగూరలను పెంచుకునే తీరిక ఎవరికీ లేదు!
రెండున్నర దశాబ్దం కిందట సంతకు బ్యాగ్ పట్టుకెళ్లి కాయగూరలను కొనే కుటుంబాలు బహు తక్కువ పల్లెల్లో. ఇంటి పట్టున దొరికే కాయగూరలతోనే కూరలన్నీ! చిక్కుడు పాదు అల్లుకుపోయిందంటే.. వారంలో రెండు మూడు రోజులు చిక్కుడు కాయతో వెరైటీలే! టమోటాలు కాస్తున్నాయంటే.. చట్నీలు, రసాలు, పప్పుకు లోటు లేదు! ఇలా వైవిధ్యం తక్కువ రోజులను గ్రామీణ కుటుంబాలు గట్టిగా చూసి ఉంటాయి. అయితే ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. క్యాప్సికం, బీట్ రూట్ వంటి పేర్లు కూడా తెలిసేవి కావు పల్లెల్లో అప్పుడు! క్యారెట్ కూడా ఒక అరుదైన కాయగూర! అలాంటి పరిస్థితుల నుంచి.. భారతీయులు పోషక విలువలను గుర్తెరిగి వంటల్లో కాయగూరలను వాడే స్థితి వరకూ ఎదిగారు! ఈ కాయగూరలు మా చిన్నప్పుడు అరుదుగా చూసేవాళ్లమని ఏ క్యాబేజీ గురించినో, క్యాలీఫ్లవర్ గురించినో చెబితే.. ఇప్పటికీ కొంత ఆశ్చర్యమే గలకవచ్చు!
కాయగూరల వినియోగం పెరిగింది. ఎంతలా అంటే.. పాతికేళ్ల కిందటి వరకూ తెలుగునాట బెండ, టమోటా వంటి పంటలను కూడా ఇంత పెద్ద ఎత్తున సాగుచేసేవారు కాదు! కాయగూరలు సాగు చేసి డబ్బు సంపాదించడం అనేది.. గత పాతికేళ్లలో విస్తృతంగా మారిన వ్యవసాయ పోకడ! మిరపను కూడా ఎండు మిర్చి కోసం ఎక్కువగా సాగు చేసే వారు. అయితే.. నగరాల్లో పెరిగిన కాయగూరల వినియోగంతో.. గ్రామాల్లో కాయగూరల సాగు విపరీతంగా పెరిగింది. అప్పటి వరకూ పంటలు అంటే.. వరి, పత్తి, మిర్చి, కుసుమ, శనగ అన్నట్టుగా ఉన్న వ్యవసాయంలోకి.. టమోటా సాగు, చిక్కుడు, బెండ వంటి కాయగూరల సాగు పాతికేళ్ల కిందటి నుంచి ప్రవేశించి.. అవి కూడా ప్రధాన పంటలుగా మారాయి. అప్పటి వరకూ ఎక్కడో ఒకటీ రెండు ప్రాంతాల్లో ఇలాంటి కాయగూరలు పండించి ఇతర ప్రాంతాలకు తరలించే పద్దతి ఉండేది. అయితే వినియోగం, డిమాండ్ పెరిగే సరికి.. వీటి సాగు విస్తృతంగా మారింది. ఇప్పుడు నయాతరం రైతులు అంటే.. కాయగూరల సాగు, పాలు డైరీ అంటారు!
అయితే.. 25 యేళ్ల కిందట పాల వ్యాపారం కూడా అరుదైనదే! ఒక పెద్ద పల్లెటూర్లో కూడా.. ఒకటీ రెండు కుటుంబాలు పాలను వ్యాపారం చేస్తే అదే ఎక్కువ! డైరీలతో పాల సేకరణ కూడా బాగా తక్కువ! అంతకన్నా ముందుకు వెళితే పాలతో వ్యాపారం చేయడం కూడా మంచిది కాదు అనే భావన గ్రామాల్లో ఉండేది! ఎవరైనా అడిగితే గ్లాసుడో, రెండు గ్లాసుల పాలో ఉచితంగా రోజూ పోసే వారు, అందుకు వస్తుమార్పిడి అన్నట్టుగా పాలు పోయించుకునే కుటుంబం ఇంకోటేదో తిరిగి ఇచ్చేది! ఇదంతా ఎప్పుడు సత్తెకాలం నాటి పద్ధతి కాదు, పాతికేళ్ల కిందటి వరకూ గ్రామాల్లో ఉండిన పద్ధతే ఇది. చాలా ఇళ్లకు పాడి ఉంటుంది. ఒకవేళ పాడి ఎండిపోతే.. ఇంకోరు కొన్నాళ్ల పాటు ఉచితంగానే పాలు పోసే వాళ్లు. ప్రతిగా మళ్లీ వారి పాడి లేనప్పుడు పాలు తిరిగి పోసే ఒడంబడికలు కూడా సహజంగానే ఉండేవి! అయితే ఇప్పుడు పాడి లేని ఇళ్లు గ్రామాల్లో కూడా బోలెడు. పక్కింట్లో వాళ్లు పాలు పితికి డైరీకి పోస్తున్నారని తెలిసినా.. వాళ్లను పాలు అడగరు. అంగట్లోకి వెళ్లి ప్యాకెట్ పాలు కొనుక్కొచ్చుకుంటారు పాడి లేని వాళ్లు! పల్లెల నుంచినే పాలు డైరీ లకు వెళ్తాయి, మళ్లీ పల్లెల్లోనే ప్యాకెట్ పాలు కూడా అమ్ముడవుతున్న చిత్రం ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తుంది!
ఇక చికెన్.- నాన్ వెజ్! బ్రాయిలర్ చికెన్ అనేది 2000 నాటికి మెజారిటీ గ్రామాలకు అరుదైనది! చికెన్ అంటే నాటుకోడి. ప్రతి ఇంటికీ పెంపుడు కోళ్లు ఉండేవి. కాస్త పెరుడు ఉంటే.. డజన్ల కొద్దీ నాటు కోళ్లకు లోటు ఉండేది కాదు! పండగలకూ, పబ్బాలకూ, బంధువులు వచ్చినా, ఎవ్వరూ రాకపోయినా తినాలనిపించినా.. కోళ్లు ఇట్టే పట్టుకోవడం, ముక్కలు కట్ చేసుకుని వండుకోవడం! ఇక మటన్ అంటే.. ఏ పండగలప్పుడో ఊర్లో గొర్రెలు కాసే వాళ్లు యాట కొట్టి భాగాలు వేసే వాళ్లు, ముందే ఎవరెవరికి కావాలో అడిగి స్టీల్ గిన్నెలు కూడా ముందే ఇప్పించుకుని తీసుకెళ్లి.. ఉదయాన్నే వాటిల్లో మటన్ పంపించే వాళ్లు! కిలో మటన్ గట్టిగా వంద రూపాయల ధర 2000 నాటికి! అయితే ఇప్పుడు గ్రామాల్లో కూడా నాటు కోళ్లు అరుదైపోతున్నాయి. చికెన్ అంటే.. బ్రాయిలర్ కోడే! కోడిని పెంచే ఓపిక, కోసే ఓపిక ఊర్లలో కూడా లేదు. అయితే.. నాటుకోడికి మళ్లీ డిమాండ్ పెరిగింది గత కొంతకాలంలో. బ్రాయిలర్ కోళ్ల పెంపకంపై సామాన్యుల్లో కూడా సందేహాలు వస్తూ ఉండటం, ప్రధానంగా రుచి లో తేడా ను గ్రహించిన వాళ్లంతా మళ్లీ నాటుకోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో నాటు కోడి రేటు కూడా పతాక స్థాయిలో ఉంది. పల్లెల్లో కోళ్లను పెంచుకుని, వాటిని అమ్ముకున్నా.. ఒక కుటుంబం హాయిగా జీవించ గల స్థాయికి చేరింది పల్లెటూరి నాటుకోడి రేటు!
జంక్ ఫుడ్ విషయంలో కూడా భారతీయులు దూసుకుపోతున్నారు! పట్టణాలూ, పల్లెలు తేడా లేకుండా చిప్స్, కూల్ డ్రింక్ లతో మొదలుపెడితే.. వీటి వినియోగం కూడా బాగా పెరిగింది. ఇండియాలో ఇలా మారిపోతున్న ఆహారపు అలవాట్లు కొన్ని సార్లు అమెరికాను కూడా భయపెడుతూ ఉంటాయి. భారతీయులు ఆహారపు వినియోగం పెరిగిపోతూ ఉందని.. గతంలో కొందరు అమెరికా అధ్యక్షులు మొత్తుకున్నారు. ఏదో చిన్న దేశం డబ్బు ఖర్చు పెట్టి అయినా ప్రొటీన్ ఫుడ్ తింటే అమెరికాకు నష్టం లేదు. అయితే ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశం ఆహారపు వినియోగం పెంచినా, ప్రోటీన్ ఫుడ్ వైపుకు మొగ్గు చూపినా.. ప్రపంచ ఆహారపు వనరులన్నీ తరిగిపోతాయని అమెరికాకు తరచూ ఆందోళన కలుగుతూ ఉంటుంది!
-జీవన్ రెడ్డి.బి
Power star Pavan Kalyan movies quiz: https://youtu.be/4Nm6OTKSNm4
Megastar Chiranjeevi movies quiz: https://youtu.be/crQfuH0Tywc
Mega power star Ramcharan movies quiz: https://youtu.be/QEsrbd6Fd1Y
Nata Simham Balakrishna movies quiz: https://youtu.be/9hMcgg-fAig
Mahesh babu movies quiz: https://youtu.be/ciiIRnisQdE
JrNTR movies quiz: https://youtu.be/nWNhnOQYo40
AlluArjun movies quiz: https://youtu.be/dBIx1lMS6hY
Prabhas movies quiz: https://youtu.be/KmHULtleqMg
viniyogam lo yenta vyardham avvutundo adikooda raaaste baagundedi.. ardha satabtabu ara kora vishayalato ajnanapu raatalu. US lo almost 40% food waste avvutundi.. 50 billion kilos.. nuvvu akkade vunta gaa oka udyamam levadeesi adi 50% cut cheste yenno tindi leni african desalaku poshakaaharam dorukutundi.. food yela pandinchalovandalo US ninchi nerchukune sthitilo India ledu.. pachipoina kooralni fridge lo pettukuni marunaadu vedi chesukuni tine pidasram prabuddhulu..
US lo antha chemical based food. Hybrid, GMO food. avi vyartham
దానితో పాటుగా రోగాలు కూడా అలాగే పెరిగాయి, షుగర్ గుండె జబ్బులు లేని ఇళ్ళు లేవు, ఇదంతా కూడా గత 3 దశాబ్దాలలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల నే
Nijame mastaru
Hi
ఇది వైస్సార్, జగన్ ముఖ్యమంత్రి గా ఉండడం వల్లే తెలుగు రాష్ట్రాల జనాలకి, వాళ్ళ లివింగ్ స్టైల్ లో చేంజ్ వచ్చింది, జీవితంలో ఎలా ఎదగాలో ప్రజలకు నేర్పించారు అంటావ్ అంతేనా
Meeru anedi nijame kani 1980 kanna mundu ayyundochu… 2000 kalla chala marputu vachayi…