శిశుమ‌ర‌ణాల రేటు.. ఇంకా సిగ్గుప‌డాల్సిన స్థాయిలోనే!

ఇలాంటి విష‌యాల గురించి విజ‌న‌రీ నేత కానీ, పార్ల‌మెంట్ లో ప్రాతినిధ్యం కోరుకునే నేత కానీ, ఏ మ‌త పెద్ద కానీ మాట్లాడ‌డు!

ఈ మ‌ధ్య‌నే విజ‌న‌రీ నేత‌ గారు పిల్ల‌ల‌ను క‌నండి.. పారితోషికం పొందండి అన్న‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌నేదో చేశారు! ఇబ్బ‌డిముబ్బ‌డిగా పిల్ల‌ల‌ను క‌నేయాల‌ని ఆయ‌న సామాన్యుల‌కు త‌న విజ‌న‌రీతో స‌ల‌హాలు ఇస్తూ ఉన్నారు! ఇద్ద‌రికి మించిన పిల్ల‌ల‌ను క‌నేవారికి పారితోషికాల‌ట‌, అలాగే ఏవేవో ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వారికే అవ‌కాశం అట‌! గ‌తంలో త‌ను కుటుంబ నియంత్ర‌ణ గురించి చెప్పార‌ట‌, ఇప్పుడు పిల్ల‌ల‌ను క‌న‌మ‌ని చెబుతున్నార‌ట‌! త‌నేం మాట్లాడుతున్నారో విజ‌న‌రీగారికి ఏ మేర‌కు అవ‌గాహ‌న ఉందో కానీ.. గ‌త ఏడాది కాలంలో భార‌త‌దేశంలో త‌ట్టుతో మ‌ర‌ణించిన పిల్ల‌ల సంఖ్య అక్ష‌రాలా ఐదు వేల‌కు పైనేన‌ని గ‌ణాంకాలు చెబుతూ ఉన్నాయి! ఇంత‌క‌న్నా సిగ్గుప‌డాల్సిన అంశం ఉంటుందా మ‌న పాల‌కులు!

త‌ట్టు అనేది క‌రోనా కాదు, మ‌రో మందులేని జ‌బ్బు కాదు. ప్రీ వ్యాక్సినేష‌న్, స‌రైన వైద్యంతో న‌యం అయ్యే ఒక ఒక‌ర‌క‌మైన జ్వ‌రం ఇది! పిల్ల‌ల‌కు వారాలు, నెల‌ల వ‌య‌సులోనే వ్యాక్సినేష‌న్ ఇస్తే.. వారికి భ‌విష్య‌త్తుల్లో త‌ట్టు పోసే అవ‌కాశ‌మే ఉండ‌దు! అయితే.. ఇండియాలో ఇప్ప‌టికీ త‌ట్టు వ్యాక్సిన్ ను అందుకుంటున్న శిశువుల శాతం 93 మాత్ర‌మే! అంటే పుట్టిన ప్ర‌తి వంద‌మంది పిల్ల‌ల్లో ప్ర‌తి ఏడు మందికీ ఇంకా త‌ట్టుకు వ్యాక్సిన్ ఇచ్చుకోలేని స్థితిలో ఉంది దేశం!

అది కూడా గ‌త పాతికేళ్ల‌లో మెరుగైన‌దే. 2000 సంవ‌త్స‌రం నాటికి ఇండియాలో న‌వ‌జాత శిశువుల్లో త‌ట్టుకు వ్యాక్సిన్ పొందిన వారి శాతం 57 వ‌ర‌కూ ఉండ‌గా.. గ‌త పాతికేళ్ల‌లో మ‌నం మెరుగయ్యాం! అయితే ఇక్క‌డ త‌ట్టుకు వ్యాక్సిన్ గురించే! కానీ.. పిల్ల‌ల‌కు ఐదేళ్ల లోపు అంద‌వ‌ల్సిన టీకాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి! లెక్క తీసి చూస్తే.. వైద్య నిపుణుల‌తో కూర్చుకుంటే.. క‌నీసం యాభై అర‌వై ర‌కాల టీకాల‌ను విడివిడిగా, క‌లిపి అందించాల్సిన అవ‌స‌రాన్ని చెబుతారు! డ‌బ్బున్న వాళ్లు, న‌గ‌రాల్లో ఆసుప‌త్రుల‌కు వెళ్లే వారు.. వీటిల్లో అన్ని టీకాల‌నూ త‌మ పిల్ల‌ల‌కు అందిస్తూ ఉంటారు. అయితే డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుంద‌ని వేయించ‌ని వారి శాతం కూడా ఇండియాలో చాలా ఉంది. ఇదే స‌మ‌యంలో వైద్యులు కూడా కొంచెం అతి చేస్తారు పెద్ద ఆసుప‌త్రుల్లో! వారి సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. భార‌త ప్ర‌భుత్వం నుంచి ఇప్పుడు అధికారికంగా అందుతున్న టీకాలు మూడంటే మూడే!

ప్రైవేట్ వైద్యులు ఒక పెద్ద షీట్ ఇచ్చి, ఐదేళ్ల వ‌య‌సులోపు పిల్ల‌ల‌కు వేయించాల్సిన వ్యాక్సిన్లను చెబుతారు. దాదాపు యాభై ర‌కాల వ్యాక్సిన్ల‌ను, క‌లిపి-విడివిడిగా ఇస్తారు. ఒక్కో టీకాకూ క‌నీసం రెండు మూడు వేల రూపాయ‌ల‌ను వ‌సూలు చేస్తారు. ఇలా చూస్తే.. ఐదేళ్ల లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ల‌కే ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతుంది న‌గ‌రాల్లో. అయితే.. ప్ర‌భుత్వం ఇలాంటి టీకాల‌ను ఉచితంగా అందించే ప‌రిస్థితి లేదు! దీంతో.. వైద్యులు సూచించే అనేక వ్యాక్సిన్ల‌లో.. కేవ‌లం మూడింటిని ఇప్పుడు ప్ర‌భుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది. అది కూడా అంద‌రికీ కాదు! ఇప్ప‌టికీ త‌ట్టుకు ఇచ్చే టీకాలు అందుతున్న‌ది 93 శాతం మందికి, ప్ర‌తి యేటా ఐదు వేల మంది పిల్ల‌లు త‌ట్టుబారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నార‌ని అధికారిక గ‌ణాంకాలు చెబుతున్నాయి. త‌ట్టు వ‌ల్ల‌నే ఐదు వేల మంది ప‌సికందులు రాలిపోతున్నారంటే.. ఇంక శిశుమ‌ర‌ణాల గురించి మ‌రింత లోతుల్లోకి వెళితే నిజాలు నిశ్చేష్టుల‌ను చేస్తాయి!

త‌న విజ‌నరీతో చెబుతున్నాను పిల్ల‌ల‌ను క‌న‌మ‌ని ఒక నేత‌, పార్ల‌మెంట్ లో మ‌న ప్రాతినిధ్యం త‌గ్గిపోతుంది పిల్ల‌ల‌ను క‌నండ‌ని మ‌రో నేత‌, మన మ‌త జ‌నాభాను పెంచాలి కాబ‌ట్టి పుట్టేంత‌మంది పిల్ల‌ల‌ను క‌నండని ఒక మ‌తం, వారి మ‌తం సంఖ్య పెరిగిపోతోంది.. మ‌న‌మూ జ‌నాభాను పెంచి మ‌తాన్ని పెంచాల‌ని మ‌రో మ‌త పెద్ద తీర్మానాలు చేస్తూ, త‌మ పుర్రెకు పుట్టిన బుద్ధుల‌తో మాట్లాడ‌తారు. అయితే.. పుట్టిన పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు ఇచ్చి కాపాడుకోవ‌డం గురించి మాత్రం ఇప్ప‌టికీ శ్ర‌ద్ధ అంతంత‌మాత్ర‌మే!

పుట్టిన పిల్ల‌ల‌కు అన్ని వ్యాక్సిన్ల‌నూ అందించ‌డం సంగ‌త‌లా ఉంచి, త‌ప్ప‌నిస‌రిగా వేయాల్సిన వాటిల్లో కూడా ఏరికోరి ఒక‌టీ రెండు వ్యాక్సిన్లు ఇస్తూ.. ఇంత‌క‌న్నా ఏం చేయ‌లేమ‌న్న‌ట్టుగా చేతులు దులుపుకుంటారు. ఇలాంటి విష‌యాల గురించి విజ‌న‌రీ నేత కానీ, పార్ల‌మెంట్ లో ప్రాతినిధ్యం కోరుకునే నేత కానీ, ఏ మ‌త పెద్ద కానీ మాట్లాడ‌డు! ఎందుకంటే.. పిల్ల‌లు క‌న‌డం గురించి మాట్లాడ‌టం సుల‌భం, పెంప‌కం గురించి మాట్లాడ‌టం క‌ష్టం!

8 Replies to “శిశుమ‌ర‌ణాల రేటు.. ఇంకా సిగ్గుప‌డాల్సిన స్థాయిలోనే!”

  1. హెడ్డింగ్ కి లోపల విషయానికి ఎమన్నా సంబంధం ఉందా న్యూట్రల్ మీడియా గారు

  2. వ్యాక్సిన్ అనేది హరామ్ అని అల్లా కి వ్యతిరేకం అని తమ ముల్లా చెప్పాడు అని

    వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఉద్యోగుల్ని కొట్టి పంపే సంగతి రాయవా ?

    1. మరల అదే మనుషులు పోలియో వచ్చిన ఆ పిల్లాడికి ప్రభుత్వం తరపు ఫ్రీ సదుపాయాలు కావాలి అని ప్రభుత్వం మీద యుద్ధం చేసే సంగతి జనాలకి అర్థం అయింది

  3. Last 70 years in India:

    Hindu growth: 300M to 1.1 B i.e. 3.6 times

    Muslim growth : 35 M to 250 M i.e. 7.1 times.

    If Hindus reproduce like Muslims, India will become Pakistan economically and if they don’t,, it will become Pakistan demographically.

Comments are closed.