ఓటిటి రాకపూర్వం శాటిలైట్ హక్కులు అంటే అద్భుతమైన ఆదాయమార్గం. హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ హక్కులతో బోలెడు ఆదాయం వచ్చేది. దాన్ని చూపించే హీరోలు రెమ్యూనిరేషన్లు పెంచేవారు. ఓ ఛానెల్‌ను తామే ప్రమోట్ చేసి, తమ సినిమాల శాటిలైట్ హక్కులను భారీ రేట్లకు ఆ చానెల్ చేత కొనేలా చేసి, అప్పుడు తమ రెమ్యూనిరేషన్లు పెంచుకుని చాలా కాలం ప్రయాణం సాగించారు కొందరు హీరోలు కలిసి స్కెచ్ వేసి. కేవలం శాటిలైట్ డీల్స్ చేసి డబ్బులు సంపాదించారు కొందరు. ఇలా ఎంతో హడావుడి ఉండేది.
ఓటిటి వచ్చిన తరువాత శాటిలైట్ నానాటికీ తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు దాదాపుగా అంతరించిపోతోంది. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇంకా శాటిలైట్ కాలేదని తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ప్రభాస్ ‘కల్కి’ శాటిలైట్ డీల్ అయిందని కాస్సేపు, కాలేదని కాస్సేపు వార్తలు వినిపిస్తూనే వున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా శాటిలైట్ ఇంతవరకు కాలేదు.
రాబోయే సినిమాలు అన్నీ ఓటిటి డీల్స్ ఎంతో కొంతకు క్లోజ్ చేసుకోగలుగుతున్నాయి కానీ శాటిలైట్ అమ్మకాలు మాత్రం తేలడం లేదు. ఒకప్పుడు శాటిలైట్, హిందీ డబ్బింగ్ కలిపి మంచి ఆదాయం వచ్చేది. అది అలా ఉండగానే ఓటిటి తోడయింది. వన్ ప్లస్… వన్ ప్లస్ వన్…అన్నట్లు మూడింతలు అయింది.
కానీ మెల్లగా శాటిలైట్ పడిపోయింది. హిందీ డబ్బింగ్ వన్ అనుకున్నది కాస్తా హాఫ్ అయింది. ఓటిటి కూడా తగ్గుతోంది. అంటే గతంలో ఓటిటి లేనపుడు రెండు రూపాయలు ఆదాయం అనుకుంటే ఓటిటి వచ్చిన ఇన్నాళ్లకు కూడా రెండు రూపాయలు ఇంకా తక్కువే ఆదాయం కనిపిస్తోంది.
కానీ ఓటిటి చూపించి హీరోలంతా భారీగా రెమ్యూనిరేషన్లు పెంచేసారు. ఇప్పుడు అవి తగ్గడం లేదు. ఫ్లాపులు తప్ప హిట్ అన్నది చూడని ఓ మిడ్ రేంజ్ హీరోలు ఇద్దరు పద కోట్లు తగ్గము అంటున్నారు. ఇటీవల్ దారుణమైన ఫ్లాప్ ఇచ్చిన హీరో ఆ సినిమాకు తీసుకున్న రెమ్యూనిరేషన్ అయిదు కోట్లు పైగానే. ఒక సీనియర్ హీరో 70 కోట్లు రెమ్యూనిరేషన్ ప్లస్ కాస్త వాటా అడుగుతున్నారు. మరో సీనియర్ హీరో 35 కోట్లు ప్లస్ కాస్త వాటా అడుగుతున్నారు. ఇంక యంగ్ హీరోల సంగతి చెప్పనక్కరలేదు.
ఇప్పుడు శాటిలైట్ అంతరించి ఆదాయం తగ్గింది. ఓటిటి అంత అనుకూలంగా లేదు. అందుకే కొద్ది బ్యానర్లు మినహా నిర్మాతలు తగ్గిపోవడం అన్నది ప్రారంభమవుతోంది. రెండు మూడేళ్ల తరువాత అసలు రంగు బయటకు వస్తుంది.
Ott is best option for movies
Good
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,