ఆయ‌న అరెస్ట్ చేయిస్తార‌ని కిర‌ణ్‌రాయ‌ల్‌కు భ‌యం!

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్‌కు అరెస్ట్ భ‌యం ప‌ట్టుకుంది. దీంతో ఆయ‌న ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించాడు.

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్‌కు అరెస్ట్ భ‌యం ప‌ట్టుకుంది. దీంతో ఆయ‌న ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించాడు. అరెస్ట్ చేస్తార‌ని, త‌క్ష‌ణం విచారించి త‌గిన ఆదేశాలు ఇవ్వాలంటూ అత‌ను లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. అయితే అత‌ని అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించ‌డం గ‌మ‌నార్హం. బుధ‌వారం విచారిస్తామ‌ని కోర్టు పేర్కొంది.

మ‌హిళ‌ను వేధించిన ఘ‌ట‌న‌లో కిర‌ణ్ రాయ‌ల్‌పై కేసు న‌మోదైంది. ల‌క్ష్మి అనే మ‌హిళ వ‌ద్ద కోట్ల రూపాయిలు డ‌బ్బు తీసుకోవ‌డంతో పాటు అన్ని ర‌కాలుగా వాడుకుని మోస‌గించాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. బాధిత మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన కిర‌ణ్‌ను పౌర సమాజం ఛీత్క‌రించుకుంటోంది. త‌న‌కు అమ్మాయిల పిచ్చి అని, ప్ర‌తిరోజూ వుండాల్సిందే అంటూ కిర‌ణ్ రాయ‌ల్ మాట్లాడ్డానికి సంబంధించిన ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇదిలా వుండ‌గా సొంత పార్టీ నేత‌ల్లో కొంద‌రు త‌న‌పై కుట్ర చేశార‌ని అత‌ని అనుమానం. తిరుప‌తికి చెందిన త‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధే త‌న‌పై కేసు న‌మోదుతో పాటు అరెస్ట్ చేయించ‌డానికి కుట్ర‌ప‌న్నార‌ని స‌న్నిహితుల వ‌ద్ద అత‌ను ఆరోపిస్తున్నాడ‌ని తెలిసింది. అధికార పార్టీ నేత‌లు చెబితే త‌ప్ప‌, పోలీస్ యంత్రాంగం ముంద‌డుగు వేసే ప‌రిస్థితి క‌నిపించ‌లేద‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంద‌ర్భంలో గో బ్యాక్ చిత్తూరు అని న‌గ‌రమంతా ప్లెక్సీలు పెట్టాన‌నే సంగ‌తిని మ‌న‌సులో పెట్టుకుని, ఇప్పుడు అరెస్ట్ చేయించ‌డానికి పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చాడ‌ని అత‌ను చెప్పుకుంటున్నాడు. అందుకే అరెస్ట్ నుంచి త‌ప్పించుకోడానికి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

8 Replies to “ఆయ‌న అరెస్ట్ చేయిస్తార‌ని కిర‌ణ్‌రాయ‌ల్‌కు భ‌యం!”

  1. ఈ వ్యక్తి JSP నుండి వచ్చిన సహేతుకమైన నాయకుడని నేను అనుకున్నాను, కానీ నేను తప్పుగా చెప్పాను. 
    అతని సంభాషణలు, సంఘ వ్యతిరేక మరియు అక్రమ కార్యకలాపాల ఆధారంగా అతను పూర్తిగా కుళ్ళిపోయాడు.
  2. అంటే కోర్ట్ కి పోతే అరెస్ట్ భయం అంటావ్…అంటే పెద్ద సజ్జల, చిన్న సజ్జల, లెల్ల, నందిగం సురేష్, జోగి రమేష్, అంబటి అందరూ బయపడ్డట్లేనా

Comments are closed.