తునిలో నాలుగోసారి వాయిదా.. సిగ్గేస్తోంది!

ప్ర‌జాస్వామ్యానికి మాయ‌ని మ‌చ్చ‌గా మిగులుతున్న ఇలాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణం

తుని మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక వ‌రుస‌గా నాలుగోసారి వాయిదా ప‌డింది. కాకినాడ జిల్లా తుని మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌లో పాల్గొన‌డానికి వైసీపీ కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త లేక‌పోవ‌డంతోనే వాయిదా ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి వ్య‌వ‌స్థ‌లో బ‌తుకుతున్నందుకు సిగ్గుప‌డాలేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వైసీపీ కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని హైకోర్టు ఆదేశించినా, అమ‌లుకు నోచుకోక‌పోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ సుధారాణి ఇంటి దగ్గ‌రి నుంచి మున్సిప‌ల్ కార్యాల‌యానికి బ‌య‌ల్దేరిన 17 మంది వైసీపీ కౌన్సిల‌ర్లు… ఎదురుగా భారీ సంఖ్య‌లో గుమికూడిన టీడీపీ రౌడీల‌ను చూసి, ప్రాణ‌భ‌యంతో వెనుతిర‌గాల్సిన ద‌య‌నీయ స్థితి.

ఏఎస్పీ స‌మ‌క్షంలోనే టీడీపీ రౌడీలు ఏ మాత్రం ఖాత‌రు చేయ‌కుండా, వైసీపీ కౌన్సిల‌ర్ల కిడ్నాప్‌, దాడికి పాల్ప‌డేందుకు ప్ర‌య‌త్నించడాన్ని చూస్తూ, స‌భ్య స‌మాజం సిగ్గుతో త‌ల‌వంచుకునే ద‌య‌నీయ స్థితి.

“నా బెల్ట్‌పైన ఉన్న మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధ‌ర్మానికి ప్ర‌తిరూపాలైతే, క‌నిపించ‌ని ఆ నాలుగో సింహ‌మేరా ఈ పోలీస్ష‌ అనే సాయికుమార్ డైలాగ్ చాలా పాపుల‌ర్‌. కానీ ఐపీఎస్ అధికారిగా క‌ళ్లెదుటే అరాచ‌కాన్ని ఎదుర్కోలేని ద‌య‌నీయ స్థితి ఎందుకు ఏర్ప‌డింది? ఎవ‌రి కోసం, ఎందుకోసం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో వాళ్ల‌కే తెలియాల‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

చివ‌రికి వైసీపీ కౌన్సిల‌ర్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోవ‌డంతో, ఎన్నిక‌కు కూడా వెళ్ల‌క‌పోవ‌డంతో నాలుగోసారి వైస్ చైర్మ‌న్ ఎన్నిక వాయిదా ప‌డ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జాస్వామ్యానికి మాయ‌ని మ‌చ్చ‌గా మిగులుతున్న ఇలాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణం… ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజానికి మంచిది కాదన్న ఆవేద‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.

6 Replies to “తునిలో నాలుగోసారి వాయిదా.. సిగ్గేస్తోంది!”

  1. పెజాసామ్యం ఫరిడవిల్లుతుంది ….. పద్దతిగా, రూల్స్ ప్రకారం పాలిస్తే ..ఎలేచ్షన్స్ చేస్తే ఇంటికి పంపించారు…. జనాలు కి ఇలానే కావలి అని అడిగారు… సో, వీళ్ళు చూపిస్తున్నారు..తప్పేముంది..

  2. జగన్ టైం లో రూల్ అఫ్ లా లేదు ఆంధ్ర లో అని ప్రచారం చేశారు.. నిజానికి ఇప్పుడు లేదు… జనాలు రూల్ అఫ్ లా వద్దు అని అడుగుతున్నారు..

Comments are closed.