తిరుప‌తి అరాచ‌కంపై సీబీఐ, సీఈసీకి ఫిర్యాదు

తిరుప‌తిలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా అధికార కూట‌మి వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న సీబీఐ, జాతీయ ఎన్నిక‌ల సంఘం దృష్టికి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా చోటు చేసుకున్న అరాచ‌కంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సీబీఐ, అలాగే చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇప్ప‌టికే తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీపై సీఎం చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌పై సుప్రీంకోర్టును సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి తిరుప‌తిలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా అధికార కూట‌మి వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న సీబీఐ, జాతీయ ఎన్నిక‌ల సంఘం దృష్టికి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లో ఓటు హ‌క్కు వినియోగించుకోడానికి బ‌స్సులో వెళుతున్న తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, అలాగే న‌గ‌ర ప్ర‌ధ‌మ మ‌హిళ డాక్ట‌ర్ శిరీష‌, వైసీపీ కార్పొరేట‌ర్ల‌పై దాడి, న‌లుగురిని కిడ్నాప్ చేశార‌ని అత్యున్న‌త వ్య‌వ‌స్థ‌ల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఏం జ‌రుగుతుందో అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

క‌నీస ర‌క్ష‌ణ కూడా క‌ల్పించ‌లేక‌పోయార‌ని ఆయ‌న ఫిర్యాదులో ప్ర‌స్తావించారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. మ‌రోవైపు తిరుప‌తి ఎంపీ గురుమూర్తి కూడా ఇదే వ్య‌వ‌హారంపై జాతీయ మానవ హ‌క్కుల క‌మిష‌న్‌, లోక్‌స‌భ స్పీక‌ర్‌, ఎస్సీ క‌మిష‌న్‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ప్ర‌ధానంగా త‌మ ఫిర్యాదులో తిరుప‌తి ఎస్పీ, జిల్లా ఎన్నిక‌ల అధికారి అయిన జాయింట్ క‌లెక్ట‌ర్, అలిపిరి సీఐ త‌దిత‌రులు అధికార పార్టీకి కొమ్ము కాశార‌ని ఆక్షేపించారు. నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి కాకుండా, అధికార పార్టీ నేత‌ల ఆదేశానుసారం వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారాన్ని తిరుప‌తి ఎంపీ సీరియ‌స్‌గా తీసుకుని, న్యాయ‌పోరాటానికి కూడా సిద్ధ‌మ‌య్యారు. త‌మ‌పై దాడికి సంబంధించి అన్ని ఆధారాల‌తో కూడిన వీడియోలు, ఇత‌ర‌త్రా వాటిని సిద్ధం చేసుకున్నారు. భ‌విష్య‌త్‌లో ఏమైనా జ‌ర‌గొచ్చు.

12 Replies to “తిరుప‌తి అరాచ‌కంపై సీబీఐ, సీఈసీకి ఫిర్యాదు”

    1. వీళ్ళు Biscuit మాత్రమే వేశారు కదా ర… మీరేమో.. జయప్రదంగా… అమ్మాయిలనే.. సప్లై చేసేసారు అప్పట్లో.. ఎంత ముదుర్లు ర మీరు..? హహ్హాహ్హాహ్

      ఈ గుడిసేటి పనులు.. అప్పుడే మరచి పోతే ఎలా?

      ఆకలి తీర్చటం లో.. మీరు.. ఎప్పుడు అందరికి ఆదర్శమే రోయ్ !

        1. //వాళ్ళు వేరే అమ్మాయిలని పంపిస్తారేమో//

          బ్రహ్మీని నే… రాహుల్ బాబా హోటల్ కి (Taj Hotel) పంపించారు కదా ర… 2019 లో…హైదరాబాద్ వచ్చినప్పుడు?!

          ఈ గుడిసేటి పనులు.. అప్పుడే మరచి పోతే ఎలా?

          చెప్పను కదా.. ఆకలి తీర్చటం లో.. మీకు సాటి ఎవ్వరు లేరు.. ఎవ్వరు రారు.. ఎప్పుడు అందరికి ఆదర్శమే రోయ్ !

          మీకు.. బైటి ఆడవాళ్లు… మన ఆడవాళ్లు అన్న తేడా నే లేదు కదా ర? పని అయిపోవాలి.. అంతే.. హహ్హహహ్హాహ్

Comments are closed.