ఉన్నట్టుండి సడెన్ గా ప్లేటు ఫిరాయించింది లావణ్య. తన భర్త రాజ్ తరుణ్ ను అప్పగించాలంటూ అప్పట్లో ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎప్పుడైతే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడో, అతడి హార్డ్ డిస్క్ పోలీసుల చేతికి చిక్కిందో, ఆ వెంటనే లావణ్య మనసు మారిపోయింది.
రాజ్ తరుణ్ చాలా మంచోడంటూ మీడియా ముఖంగా ప్రకటించింది లావణ్య. అతడికి క్షమాపణలు కూడా చెప్పింది. ఎదురుగా ఉంటే కాళ్లు పట్టుకునేదాన్నంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అతడిపై పెట్టిన కేసుల్ని కూడా వెనక్కు తీసుకుంటానని ప్రకటించింది.
రాజ్ తరుణ్ కు లైన్ క్లియర్..?
ఇప్పటివరకు జరిగింది అందరికీ తెలిసిందే. ఇది జరిగి 5 రోజులు అవుతోంది. మరి రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, లావణ్య కేసుల సంగతేంటి? లావణ్య నిజంగానే రాజ్ తరుణ్ పై పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటుందా? అసలు అది జరిగే పనేనా?
రాజ్ తరుణ్ నిజాయితీపరుడే కావొచ్చు. ఈ కేసులతో అతడికి ఎలాంటి సంబంధం లేకపోయి ఉండొచ్చు. కానీ లావణ్య పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకోవడం అంత ఈజీ కాదంటున్నారు చాలామంది. ఒకసారి మేటర్ కోర్టు వరకు వెళ్లిన తర్వాత వాపస్ తీసుకుంటామంటే కుదరదని, నిజానిజాలు తేల్చేవరకు కోర్టు తన పనితాను చేస్తుందని, కేసు తీవ్రత బట్టి అవసరమైతే స్వయంగా కోర్టు జోక్యం చేసుకొని కేసును సుమోటోగా స్వీకరించే అవకాశం కూడా ఉందంటున్నారు.
రాజీకొస్తే డ్రగ్స్ పరిస్థితేంటి..?
నిజంగా ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాకు సంబంధించిన కేసు అయితే విత్ డ్రా చేసుకోవడం ఈజీ. కోర్టు అనుమతితో, కోర్టు వెలుపల రాజీ చేసుకోవచ్చు. కానీ ఇందులో మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి. గతంలో రాజ్ తరుణ్ ను, డ్రగ్స్ కు లింక్ చేస్తూ లావణ్య చాలా మాట్లాడింది. మరి ఆ స్టేట్ మెంట్స్ సంగతేంటి? “అప్పట్లో నేను అబద్ధమాడానంటూ” ఆమె చెబితే సరిపోతుందా?
ఇప్పుడు చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. ఈ కేసులో చాలా చిక్కులున్నాయి. రాజ్ తరుణ్ తనకు స్వయంగా అబార్షన్ చేయించాడంటూ ఆరోపించడమే కాకుండా, కొన్ని సాక్ష్యాల్ని కూడా కోర్టుకు సమర్పించింది లావణ్య. ఇది కాస్త సీరియస్ కేసు. ఆమె వెనక్కుతగ్గినంత మాత్రాన కేసు కొట్టేస్తారనుకోవడం అవివేకం అవుతుంది.
జనజీవన స్రవంతిలోకి రావొచ్చు..
లావణ్య ఇచ్చిన స్టేట్ మెంట్ తో ప్రస్తుతానికైతే రాజ్ తరుణ్ కు భారీ ఊరట లభించినట్టే. ఉన్నఫలంగా కేసుల నుంచి అతడు బయటపడలేడు కానీ, ధైర్యంగా బయటకు మాత్రం రావొచ్చు. కేవలం ఈ కేసులు, వివాదాల వల్ల రాజ్ తరుణ్ పూర్తిగా బయటకు రావడం మానేశాడు. సినిమా షూటింగ్ తర్వాత తిరిగి ఇంటికెళ్లిపోతున్నాడు. మరో సినిమా ఫంక్షన్ లో కనిపించడం లేదు. ఇకపై అతడు కాస్త స్వేచ్ఛగా జనంలోకి రావొచ్చు.
అయితే రాజ్ తరుణ్ సచ్ఛీలుడిగా బయటకు రావాలంటే అదంతా లావణ్య చేతిలో ఉంది. ముందుగా ఆమె తను తప్పుడు కేసు పెట్టినట్టు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అదే విషయాన్ని కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. సాక్ష్యాలపై కూడా ఆమె సవివరంగా స్పందించాల్సి ఉంటుంది. అవసరమైతే తను జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
మరి రాజ్ తరుణ్ కోసం ఆమె ఇంత త్యాగం చేస్తుందా? రాజ్ తరుణ్ విషయంలో తను ఎన్నో తప్పులు చేశానని, పాప పరిహారంలో భాగంగా తనను మరోసారి జైళ్లో పెట్టిన, ఎలాంటి శిక్ష విధించినా అనుభవిస్తానంటూ ఆమె ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
వ్యవస్థలను తమకు ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నారు.
ఇక్కడ డబ్బు సెటిల్మెంట్ జరిగి ఉంటుంది. చివరకు అందరినీ డబ్బుతో మభ్యపెట్టి, వీళ్ళ వివాదాలను ఫాలో అయ్యేవారిని మాత్రం వెర్రి పుష్పాలను చేస్తున్నారు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు,