వైసీపీ బిగ్ బ్లాస్ట్‌.. పోస్టు క‌ల‌క‌లం!

త‌మ సోద‌రుడిని కిడ్నాప్ చేసి, బెదిరించి త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేసేలా ఉసిగొల్పార‌ని ఫిర్యాదుదారుని సోద‌రుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.

వైసీపీ త‌న ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. గ‌న్న‌వ‌రం కేసులో విస్తుపోయే నిజాల్ని సాయంత్రం ఏడుగంట‌ల‌కు బ‌య‌ట పెట్ట‌నున్న‌ట్టు ఆ పార్టీ ప్ర‌క‌టించింది. సినిమా విడుద‌ల‌కు ముందు టీజ‌ర్ విడుద‌ల చేసిన చందంగా… వైసీపీ ఆ ప‌ద్ధ‌తిని అనుస‌రించ‌డం గ‌మ‌నార్హం.

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొద‌ట టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీకి ముంద‌స్తు బెయిల్ ల‌భించింది. కానీ ఎవ‌రైతే కార్యాల‌యంపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారో, ఆ ద‌ళిత యువ‌కుడే త‌న‌కు సంబంధం లేద‌ని కోర్టుకు అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.

దీంతో గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ త‌ర్వాత కేసు మ‌రో మ‌లుపు తిగింది. త‌మ సోద‌రుడిని కిడ్నాప్ చేసి, బెదిరించి త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేసేలా ఉసిగొల్పార‌ని ఫిర్యాదుదారుని సోద‌రుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ ఫిర్యాదు మేర‌కు వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదు చేశారు.

హైద‌రాబాద్ నివాసంలో వుంటున్న వంశీని విజ‌య‌వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో గ‌న్న‌వ‌రం ఘ‌ట‌న‌పై వైసీపీ బ‌య‌ట పెట్టే సంచ‌ల‌న నిజాలేంటో తెలుసుకోవాలంటే… సాయంత్రం ఏడు గంట‌ల వ‌ర‌కు ఎదురు చూడాల్సి వుంటుంది. వైసీపీ బ‌య‌ట పెట్టే నిజాలేంటో అనే ఉత్కంఠ నెల‌కుంది.

21 Replies to “వైసీపీ బిగ్ బ్లాస్ట్‌.. పోస్టు క‌ల‌క‌లం!”

  1. ఏమైనా అధరాలు ఉంటె కోర్ట్ కి పోవొచ్చు కదా .. ఇలా ట్వీట్లు పెట్టుకోక పోతే ..

  2. భారతి రెడ్డి రోడ్డున పడుతుందా? అవినాష్ రెడ్డి , భారతి రెడ్డి, వల్లభనేని వంశీ పెళ్ళాం , కొడాలి నాని పెళ్ళాం కలసి పాద యాత్ర

  3. కడాన కడుపు రగిలిపోదండీ…… కాదండీ ఆవేదన ఉండదండీ……. రక్తం మరగదండి…………………. తమాషా అనుకొవొద్దు అండి…

  4. ఇందులో బ్లాస్టింగ్ ఏముందో ఈ పోస్ట్ పెట్టిన ఎర్రి ప*** ఆంధ్ర గ్యాస్ వానికే తెలియాలి

Comments are closed.