ఆల‌పాటికి వ్య‌తిరేకంగా కాపుల తీర్మానం!

గుంటూరు-కృష్ణా జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిని ఓడించాల‌ని కాపులు తీర్మానం చేసిన‌ట్టు స‌మాచారం.

గుంటూరు-కృష్ణా జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిని ఓడించాల‌ని కాపులు తీర్మానం చేసిన‌ట్టు స‌మాచారం. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆల‌పాటికి ఓట్లు వేయొద్ద‌ని కాపు సంఘాలు స‌మావేశ‌మై తీర్మానించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ రెండు జిల్లాల్లో రెండు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైరం కాస్త రాజ‌కీయ వైరంగా మారిన సంగ‌తి తెలిసిందే. వంగ‌వీటి రంగా హ‌త్య‌తో ఇప్ప‌టికీ ఆ రెండు సామాజిక వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం శ‌త్రువులుగా చూసుకునే ప‌రిస్థితి.

అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డం, ఆయ‌న్ను వైఎస్ జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌డంతో కాపు సామాజిక వ‌ర్గం పంతం ప‌ట్టి వైసీపీని ఓడించింది. అయితే కూట‌మి ప్ర‌భుత్వంలో త‌మ‌కు త‌గిన ప్రాధాన్యం లేక‌పోవ‌డం, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న సామాజిక వ‌ర్గంలో కూడా మార్పు కూడా క్ర‌మంగా మార్పు వ‌స్తోంది. ప్ర‌భుత్వంలో ప‌వ‌న్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌, కందుల దుర్గేష్‌కు మంత్రి ప‌ద‌వులొచ్చాయ‌ని, మిగిలిన వాళ్ల‌ను ప‌ట్టించుక‌నే దిక్కేలేద‌నే ఆవేద‌న వుంది.

ఎందుకో కానీ, ఆల‌పాటి రాజేంద్ర‌కు వ్య‌తిరేకంగా చేయాల‌ని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాపులు నిర్ణ‌యించార‌నే స‌మాచారం టీడీపీలో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. మెజార్టీ కాపులు పీడీఎఫ్ అభ్య‌ర్థి ల‌క్ష్మ‌ణ‌రావుకు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం కూడా చేస్తుండ‌డం విశేషం. ఆల‌పాటి, ల‌క్ష్మ‌ణ‌రావు ఇద్ద‌రూ క‌మ్మ సామాజిక వ‌ర్గ‌మే అయిన‌ప్ప‌టికీ, వామ‌ప‌క్షాల‌కు చెందిన నాయ‌కుడి వైపే వాళ్లు మొగ్గు చూపుతున్నారు.

ఈ ప‌రిణామాలు ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య లోలోప‌ల అస‌మ్మ‌తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితం టీడీపీకి వ్య‌తిరేకంగా వ‌స్తే మాత్రం…ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకునే ప్ర‌మాదం వుంది. ప్ర‌స్తుతానికైతే అంతా గుంభ‌నంగా ఉన్నారు.

29 Replies to “ఆల‌పాటికి వ్య‌తిరేకంగా కాపుల తీర్మానం!”

  1. ఇంత వ్యతిరేకత ఉన్నా కాని మన గాలోడు పోటీ పెట్టకుండా తప్పుకున్నాడు

  2. Question for all GA subscribers :

    వచ్చాడు వార్నింగ్ ఇచ్చాడు బెంగుళూరు పోతాడు

    ఎవడు vadu , పేరేంటి ?

    1. ఆలపాటి… ఓడిపోయాక… కాస్త టచ్ లో కెళ్ళు… వాడికి కాస్త ప్రశాంతత సాంత్వన అవసరం అప్పటికి.

          1. తెలుసు గురూ మా ఎమ్మెల్యే దళిత అన్నీ కులాల వనభోజనాలకు ఎమ్మెల్యేను పిలుస్తారు, కుర్చీలో ఉన్నారు కాబట్టి భయంతోనో గౌరవంతోనో. కానీ ఆలపాటి రాజా 2022 లో ఎమ్మెల్యే కాదే పైగా ప్రతిపక్ష పార్టీ

        1. వారిని వనభోజనానికి వెళ్లేదాన్ని బట్టి కులం డిసైడ్ చేస్తావా? పోయిన కమ్మ వనభోజనానికి రేవంత్ రెడ్డి వెళ్ళాడు…రేవంత్ ని కమ్మోదిని చేసేద్దాం

          1. రేవంత్ ముఖ్యమంత్రి, చంద్రబాబు శిష్యుడు కాబట్టి పిలవకపోతే కోపాలు వస్తాయని పిలిచారు, వచ్చాడు. ముఖ్యమంత్రి కాకముందు పిలిచారా? ఆలపాటి రాజేంద్రప్రసాద్ కమ్మ వనభోజనాలకు వెళ్ళిన వీడియో, ఆర్టికల్ ఉంటే పెట్టు నమ్ముతా

    1. ఆలపాటి రాజేంద్ర్రసాద్ కమ్మ….నేను ఆయన దగ్గర నుండి చుండూరు లో సర్టిఫికెట్ కూడా అందుకున్నాను

  3. ఎవరు చెప్పారు పద్మనాభరెడ్డి గాడు ఎమైనా చెప్పాడా గారు అనే అర్హత వైచీప్ కి అమ్ముడుపోయిన రోజే పోగొట్టుకున్నాడు వాడు

Comments are closed.