“అర్థరాత్రి మంచు మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు.. కేసు ఏంటో కూడా చెప్పకుండా అరెస్ట్.. మోహన్ బాబు అండతో రెచ్చిపోయిన పోలీసులు..” ఇలా మంచు మనోజ్ పై ఉదయం నుంచి లెక్కలేనన్ని స్టోరీలు.
నిజానికి జరిగింది వేరు. మంచు మనోజ్ ను అరెస్ట్ చేయలేదు. అతడే తనకుతానుకగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు… ఇంతకీ ఏం జరిగిందంటే..?
మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలు జరుగుతున్నాయని, ఆ విద్యార్థుల తరఫున పోరాటం చేస్తున్నానంటూ తనకుతానుగా ప్రకటించుకున్న మంచు మనోజ్.. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఓ రెస్టారెంట్ లో తన అనుచరులతో పాటు బస చేశాడు. రౌండ్స్ లో భాగంగా భాకరాపేట పోలీసులు అటువైపు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల్ని ఆపి ప్రశ్నించారు. తాము మంచు మనోజ్ మనుషులమని వాళ్లు చెప్పడంతో.. పోలీసు స్టేషన్ కు రావాలన్నారు.
దీంతో అర్థరాత్రి తన అనుచరులతో కలిసి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. వెళ్లేసరికి అక్కడ ఎస్సై లేరు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే కొన్ని గంటల పాటు బైఠాయించాడు మనోజ్. సీఐతో మాట్లాడిన తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
ప్రతిరోజూ జరిగే పోలీస్ రౌండ్స్ లో భాగంగానే ఈ తనిఖీ జరిగిందని, మంచు మనోజ్ పై ఎలాంటి కేసు ఫైల్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు తను తిరుపతిలోనే ఉన్నాననే విషయాన్ని కొంతమందికి తెలియజేయడం కోసం, అర్థరాత్రి మంచు మనోజ్ ఈ డ్రామాకు తెరలేపి ఉంటాడని కొందరంటున్నారు.
lol. emi coverup drama ra bhai.
ఏంటి రా నీ సమస్య…KA పాల్ లెక్కన అయ్యావ్
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,