అతడో యంగ్ హీరో. 2-3 మంచి హిట్స్ కూడా కొట్టాడు. అన్నింటికీ మించి కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్.. ఇలా చాలా విషయాల్లో దగ్గరుంచి ‘చొరవ’ తీసుకుంటాడనే పేరుంది. ప్రస్తుతానికి అతడి హవా నడుస్తోంది. దీంతో మనోడు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది.
ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్న ఈ హీరో, ఆ రెండు సినిమాల నుంచి ఇద్దరు హీరోయిన్లను తప్పించేశాడు. తనకు నచ్చిన మరో ఇద్దర్ని తెచ్చుకున్నాడు. అడిగితే పెర్ఫార్మెన్స్ తనకు మ్యాచ్ కావడం లేదన్నాడు. దీంతో నిర్మాతలకు భారీగా డబ్బు వృధా అయింది.
అప్పటివరకు ఆ హీరోయిన్లతో తీసిన ఫూటేజ్ మొత్తం తీసి పక్కనపడేయాల్సి వచ్చింది. దీనికితోడు ఓ స్టార్ హీరోయిన్ ను తప్పించాల్సి రావడంతో, ఆమెకు కొంత ఎమౌంట్ ఇచ్చి మరీ సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత ఖర్చుకు ఆ హీరోనే కారణం.
ఇది చాలదన్నట్టు ఇప్పుడీ హీరో తన ‘క్రియేటివిటీ’ చూపిస్తున్నాడు. ఆల్రెడీ తీసిన సన్నివేశాల్నే మళ్లీ తీస్తున్నాడు. వేసిన సెట్ ను షూటింగ్ తర్వాత తీయొద్దంటున్నాడు, మరోవైపు కొత్త సెట్స్ వేయమంటున్నాడు. అడిగితే తన స్టయిల్ ఆఫ్ మేకింగ్ ఇదే అని చెబుతున్నాడు.
నిజానికి ఇతడి స్టయిల్ ఇదే. కాకపోతే మార్కెట్ లేనప్పుడు ఈ పద్ధతి నడిచింది. ఖర్చు కాస్త పెరిగినా ఆ నిర్మాతలు తట్టుకున్నారు. కానీ ఇప్పుడు హీరో మార్కెట్ పెరిగిపోయింది, దానికి తగ్గట్టే బడ్జెట్స్ కూడా పెరిగాయి. ఇప్పుడు కూడా పాత స్టయిల్ లోనే తీసి, చూసి, మళ్లీ తీస్తానంటే ఎలా? ఈ విషయం ఆ హీరోకు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. హీరో అలిగితే మళ్లీ అదో ఖర్చు.
సిద్ధుడు
Adivi seshu…heroin sruthi hasan
buddhu chinnalagadda
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Mahanubavudu