క‌డ‌ప‌లో ష‌ర్మిల‌కు షాక్‌!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు సొంత జిల్లాలో పార్టీ కీల‌క నాయ‌కుడు గ‌ట్టి షాక్ ఇచ్చారు.

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు సొంత జిల్లాలో పార్టీ కీల‌క నాయ‌కుడు గ‌ట్టి షాక్ ఇచ్చారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసిన అప్జ‌ల్‌ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు, ఆయ‌న క‌డ‌ప న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు కూడా. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్జ‌ల్‌ఖాన్ 24,500 ఓట్ల‌ను సాధించారు. గ‌తంలో ఆయ‌న వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.

అయితే ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలి తీరుతో ఆయ‌న విసిగిపోయిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ బాగోగులు ప‌క్క‌న ప‌డేసి, పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మైన సొంత ఎజెండాతో ష‌ర్మిల వెళుతోంద‌నే ఆవేద‌నతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం. అప్జ‌ల్‌ఖాన్ పోటీ చేయ‌డంతోనే ముస్లిం ఓట్ల‌లో చీలిక వ‌చ్చి, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి భారీ దెబ్బ ప‌డింది. వైసీపీకి కంచుకోట లాంటి క‌డ‌ప‌లో ఆ పార్టీ ఓడిపోవ‌డానికి కాంగ్రెస్ త‌ర‌పున అప్జ‌ల్ పోటీ చేయ‌డం కూడా ఒక కార‌ణం.

ఇప్పుడు అప్జ‌ల్‌ఖాన్ కాంగ్రెస్‌ను వీడ‌డం, ఆ పార్టీకి గ‌ట్టి దెబ్బే. ఆర్థికంగా కూడా పార్టీకి అత‌ను అండగా నిలిచారు. అలాంటి నాయ‌కుడు కాంగ్రెస్‌ను వీడ‌డంతో అస‌లే, అంతంత మాత్రంగా వుండే కాంగ్రెస్ దిక్కులేనిదైంది. అప్జ‌ల్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంట‌నేది ఇంకా తెలియ‌డం లేదు.

టీడీపీలో చేరే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే సిటింగ్ ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి రూపంలో ఆ పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం వుంది. వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కుటుంబంపై క‌డ‌ప ప్ర‌జానీకం ఆగ్ర‌హంగా వున్నారు. ముఖ్యంగా అంజాద్‌బాషా సోద‌రుడి వ్య‌వ‌హార‌శైలి ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. అప్జ‌ల్‌ను చేర్చుకునే అవ‌కాశాల్ని కొట్టి పారేయ‌లేం.

4 Replies to “క‌డ‌ప‌లో ష‌ర్మిల‌కు షాక్‌!”

Comments are closed.