రజనీకాంత్, చిరంజీవి, సల్మాన్ ఒకటేనా?

ఎలా చూసుకున్నా సల్మాన్ కెరీర్ కు వెయిటింగ్ పీరియడ్ లేదు. ఉన్న టైమ్ లో చకచకా సినిమాలు తీయాలి

ఒకప్పుడు కొన్నేళ్ల పాటు వరుసగా ఫ్లాపులిచ్చాడు. అయినా సినిమాలు చేశాడు, హిట్ కోసం ఎదురుచూశాడు. మొత్తానికి ‘వాంటెడ్’ సినిమాతో కమ్ బ్యాక్ అనిపించుకున్నాడు. అయితే ఈసారి సల్మాన్ ఖాన్ కు అంత టైమ్ లేదు.

ప్రస్తుతం అతడి వయసు 59 ఏళ్లు. ఈ ఏడాది గడిస్తే షష్టిపూర్తి. ఇలాంటి టైమ్ లో ఫ్లాపులొస్తే వెయిట్ చేయడానికి సల్మాన్ దగ్గర టైమ్ లేదు. కాబట్టి సికందర్ సినిమా కచ్చితంగా హిట్టవ్వాల్సిందే.

సల్మాన్ కు నార్త్ బెల్ట్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదే టైమ్ లో కొత్త తరం ఆడియన్స్ కూడా తయారయ్యారు. ఇప్పటికీ తన వయసులో సగం కూడా లేని అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటే, వాళ్లు చూడలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఓపెన్ గానే విమర్శిస్తున్నారు.

సౌత్ లో హీరోలకు వయసుతో సంబంధం లేదు. ఎంత వయసు మీదపడినా వాళ్లు హీరోలే. అందుకే రజనీకాంత్, కమల్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి చాలామంది ఇంకా హీరోలుగా కొనసాగుతున్నారు.

నార్త్ లో అలాంటి పరిస్థితి లేదు. ఎంతోమంది సూపర్ స్టార్లు, ఫ్లాపులొచ్చి, వయసు మళ్లిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులయ్యారు. సల్మాన్ ఖాన్ కూడా దీనికి మినహాయింపు కాదు. పైగా అప్పటితో పోలిస్తే, ఇప్పుడు బాలీవుడ్ లో మరింత గడ్డు పరిస్థితి.

సో.. ఎలా చూసుకున్నా సల్మాన్ కెరీర్ కు వెయిటింగ్ పీరియడ్ లేదు. ఉన్న టైమ్ లో చకచకా సినిమాలు తీయాలి, అదే టైమ్ లో ఫ్లాపులు ఎక్కువ పడకుండా జాగ్రత్త పడాలి.

7 Replies to “రజనీకాంత్, చిరంజీవి, సల్మాన్ ఒకటేనా?”

  1. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    వయసు విషయంలో మన వారి కో లెక్క హిందీ వారికి ఒక లెక్క ఉంటుందా ? ఇందులో ఎవరైనా ఒకటే అందుకు మినహాయింపు ఎవరూ లేరు.

    అదే హిందీ చిత్రం సీమలో సహచర నటులైన అక్షయ్ కుమార్ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ తదితర నటులు కూడా అతని వయసు వారే కదా . మరి వారి ఉన్న మినహాయింపు ఇతనికి లేదా.? ఏమిటో నువ్వు నీ బోడి లెక్కలు.

Comments are closed.