నాగచైతన్య సినిమా ఏదీ ఇప్పుడు రిలీజ్ లేదు. పైగా చైతూ సినిమాను ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ మేటర్ సినిమా కాదు, ఫుడ్. అవును.. నాగచైతన్యకు చెందిన రెస్టారెంట్ ను ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తున్నాడు. అది కూడా జపాన్ లో.
నాగచైతన్యకు షోయు అనే క్లౌడ్ కిచెన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా జపాన్ రుచుల్ని అందిస్తుంది. చైతూకు వ్యక్తిగతంగా జపాన్ రుచులంటే ఇష్టం కాబట్టి ఈ రెస్టారెంట్ తెరిచాడు. ఇప్పుడీ రెస్టారెంట్ గురించి జపాన్ లో ఉన్న ఎన్టీఆర్, అక్కడి ఆడియన్స్ కు చెబుతున్నాడు.
“సూషీ వంటకం అంటే నాకు చాలా ఇష్టం. నాలా అది ఎవరికైనా ఇష్టమైతే, వాళ్లకు నేను ఓ మంచి రికమండేషన్ అందిస్తాను. హైదరాబాద్ లో నా ఫ్రెండ్ నాగచైతన్య షోయు అనే రెస్టారెంట్ పెట్టాడు. ది బెస్ట్ జపనీస్ ఫుడ్ మీకు అక్కడ దొరుకుతుంది.”
తనకు వ్యక్తిగతంగా ఉనాగీ సుషీ అంటే చాలా ఇష్టమంటున్నాడు ఎన్టీఆర్. దేవర సినిమా ప్రచారంలో భాగంగా జపాన్ లో పర్యటిస్తున్న ఈ నటుడు, దర్శకుడు కొరటాల శివతో కలిసి స్థానిక మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఇందులో భాగంగా జపాన్ వంటకాలంటే తనకు ఇష్టమంటూనే, నాగచైతన్య రెస్టారెంట్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.
Sweet gentlemen