ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. ఎంత సంపద ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోతే ఆ జీవితం నరకప్రాయం. మరీ ముఖ్యంగా ఇంటికి ఇల్లాలు, పిల్లలు వెలుగు. అందుకే వాళ్ల ఆరోగ్యమే లక్ష్యంగా ఎన్ఆర్ఐ స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది. ఆ సంస్థ పేరే ట్రెయిన్ అండ్ హెల్ప్ బేబీస్ (TaHB). అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అంకితమై పని చేస్తుండడం విశేషం.
అమెరికాలోని డల్లాస్ వేదికగా 2015లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను స్థాపించారు. ఈ స్వచ్ఛంద సంస్థను ప్రముఖ వైద్య నిపుణుల బృందం నడుపుతుండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సంస్థ సంస్థాపకురాలు డాక్టర్ సుమనా నంజుండాచార్, సహ వ్యవస్థాపకుడు డా. ప్రకాశ్ కబ్బూర్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోరీ రోడ్రిగెజ్, బోర్డ్ సభ్యుడు మహాంతేశ్ నాశి, ఫౌండేషన్ అధ్యక్షుడు జాన్ హిల్, బోర్డ్ సభ్యులు హరి సింగం, ప్రసాద్ పోలంరాజు .
ఈ సంస్థ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, మాతాశిశు సంరక్షణ చైతన్య కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అయితే తెలంగాణలోని వరంగల్‌లో నిర్వహించడానికి ఆర్థికంగా అండదండలు అందించడానికి కొందరు ముందుకొచ్చారు. ఇదే సందర్భంలో తిరుపతి కేంద్రంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్థికంగా సాయం అందించడానికి ముందుకు రావాల్సిన అవసరం వుందంటున్నారు.
“కాపెల్ రోటరీ క్లబ్” గతకొన్నేళ్లుగా భారతదేశం, ఇథియోపియాలోని TaHB కార్యకలాపాలకు ఆర్థికంగా సహాయపడుతోంది. Dallas Area Telangana Association (DATA) వరంగల్ వైద్య కేంద్రానికి మద్దతు అందిస్తోంది. అలాగే DARA తిరుపతి, రాయలసీమలో కొత్తగా ఏర్పడనున్న కేంద్రాలకు మద్దతు అందించే దిశగా పరిశీలిస్తోంది.
ప్రత్యేకంగా, వైద్య నిపుణుల సామర్థ్యాలను పెంచడం, అవసరమైన వైద్య పరికరాలను అందించడం, నిరంతర వైద్య విద్యను అందించడం ద్వారా నవజాత శిశువుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తోంది.
సంస్థ లక్ష్యం & విస్తరణ
సుస్థిర మాతాశిశు ఆరోగ్య సంరక్షణను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న TaHB, ఇప్పటి వరకు భారతదేశంలోని 13 వైద్య కేంద్రాలకు సహాయం అందించింది. వీటిలో తిరుపతి, వరంగల్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా, ఇథియోపియాలో మూడు వైద్య కేంద్రాలకు కూడా మద్దతుగా నిలిచింది.
TaHB ఆధ్వర్యంలో మార్చి 30న ప్లానోలోని అతిథి వేదికలో ఒక ఫండ్ రైజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి డల్లాస్‌లోని ప్రముఖ తెలుగు, కన్నడ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. మద్దతు ఇస్తున్న ఆ సంస్థల వివరాలు
– Dallas Area Rayalaseema Association (DARA)
– Rayalaseema Association of North America (RANA)
– Telugu Association of North Texas (TANTEX)
– Telangana People’s Association of Dallas (TPAD)
– KADAK, MKANT, VSNA తదితరులు
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే గొప్ప ఆశయంతో స్వచ్ఛందంగా చేపడుతున్న కార్యక్రమాలకు మీ హార్థిక, ఆర్థిక అండదండలు అందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని TaHB నిర్వాహకులు కోరుతున్నారు.
సీమాంధ్ర డాక్టర్స్ తెలంగాణ లో వరంగల్ కేంద్రం పెట్టడం వేస్ట్ కనీసం హైదరాబాద్ లో పెట్టివుంటే కొంతైనా బాగుండేది
మా ఊరిలో మా వీధి వారి ఆసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పెడుతున్నా. లల్
ఇథియోపియా అంటే గట్టిగా వాటికన్ మత మార్పిడి ముఠా నే.