బాబు ఎప్పుడు ముంచ‌బోతున్నారో…బీజేపీ నేత విసుర్లు!

బీజేపీతో మంచిగానే వుంటూ, ఆ పార్టీకి న‌ష్టం వ‌చ్చేలా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఉద్దేశం.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి సెటైర్స్ ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్ష‌మైన బీజేపీకి చెందిన నాయ‌కుడు కావ‌డంతో సుబ్ర‌మ‌ణ్యం స్వామి విసుర్ల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో కల్తీ జ‌రిగింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేశార‌ని స్వామి గుర్తు చేశారు. అయితే క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆధారాలు స‌మ‌ర్పించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించినా, సీఎం స్పందించ‌లేద‌ని విమ‌ర్శించారు. బాబును ప్ర‌ధాని మోదీ మంద‌లించాల‌ని ఆయ‌న కోరారు. ఇదే సంద‌ర్భంలో బీజేపీని చంద్ర‌బాబు ఎప్పుడు ముంచబోతున్నార‌ని వ్యంగ్య ధోర‌ణిలో ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

బీజేపీతో మంచిగానే వుంటూ, ఆ పార్టీకి న‌ష్టం వ‌చ్చేలా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఉద్దేశం. అందుకే ఆయ‌న నుంచి అలాంటి ప్ర‌శ్న వ‌చ్చింద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. చంద్ర‌బాబు క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై నిగ్గు తేల్చాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన వాళ్ల‌లో సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఒక‌రు.

బాబు వేసిన సిట్ ద‌ర్యాప్తు సంస్థ వ‌ద్ద‌ని, స్వ‌తంత్ర విచార‌ణ క‌మిటీ వేయాల‌ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అలాగే సుబ్ర‌మ‌ణ్య‌స్వామి త‌దిత‌రులు సుప్రీంకోర్టును కోరిన నేప‌థ్యంలో, ఏపీ స‌ర్కార్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. సీబీఐ నేతృత్వంలో విచార‌ణ జ‌రిగేలా సుప్రీంకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సిట్ న‌లుగురు నిందితుల్ని అరెస్ట్ కూడా చేసింది. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ స్పందిస్తుందో, లేదో మ‌రి!

9 Replies to “బాబు ఎప్పుడు ముంచ‌బోతున్నారో…బీజేపీ నేత విసుర్లు!”

  1. ఇది ఎమి కామిడిరా అయ్యా! ఈయన BJP సీనియర్ నేతా???

    ఈయన ని నువు ఒక్కడివె BJP అని చెపుతున్నావు! పాపం BJP లొ ఎ నాయకుడూ నీకు దొరకలెదా ?

  2. Subramanyam swamy even criticised Modi on many occasions. He neither has credibility nor influence in BJP and in public. Just for name sake he is in BJP.

    You said that supreme court appointed SIT is setback for TDP. Again, you mentioned that the SIT arrested 4 people associated with the issue. These 4 people are involved in the scam, as per TDP. So, can you explain how is it a setback for TDP. You are as confused as your ‘Jagan anna’. Your ‘Jagan anna’ criticises NDA govt in AP and supports same NDA govt in Centre.

Comments are closed.