హీరో కోరిక తీరలేదు

ఓ చిన్న హీరోకు ఒక కోరిక ఉంది. అతనికి పెద్దగా హిట్‌లు లేకపోయినా, ఓ హీరోయిన్‌ బొద్దు అందాలకు కుర్రకారులో మంచి క్రేజ్ ఉంది.

హీరోలకు కొన్ని కోరికలు ఉంటాయి—ఫలానా హీరోయిన్‌తో నటించాలి, ఫలానా హీరోయిన్‌తో డ్యాన్స్ చేయాలి ఇలా. పెద్ద హీరోలకు ఈ కోరికలు సులువుగా తీరిపోతాయి. కానీ చిన్న, మిడ్-రేంజ్ హీరోలకు మాత్రం అంత తేలిక కాదు.

ఓ చిన్న హీరోకు ఒక కోరిక ఉంది. అతనికి పెద్దగా హిట్‌లు లేకపోయినా, ఓ హీరోయిన్‌ బొద్దు అందాలకు కుర్రకారులో మంచి క్రేజ్ ఉంది. కానీ ఆమె చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. క్రేజీ డైరెక్టర్-యంగ్ హీరో కాంబినేషన్‌లో చేసినా, సీనియర్ హీరోతో చేసినా కూడా సక్సెస్ రాలేదు. ఆమె బొద్దు అందాలు ఆరబోయడానికి తప్ప మరేదానికి పనికిరాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ పాప మీద ఓ యంగ్ హీరో కన్నేశాడు. అతని స్థాయికి ఎక్కువ, మిడ్-రేంజ్ హీరో స్థాయికి తక్కువ అనే లెవెల్‌కి చెందిన ఈ హీరోయిన్‌ను తన సినిమాలో ఎలాగైనా పెట్టాలని అనుకున్నాడు. అయితే, ఆ సినిమాలో హీరోయిన్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. అందుకే ఏదైనా కొత్త పాత్ర క్రియేట్ చేసి పెట్టాలని ప్రయత్నించారట—కుదరలేదు. కనీసం ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్‌లో అయినా పెట్టాలని ట్రై చేసారట—కానీ బడ్జెట్ పర్మిట్ చేయలేదు.

దాంతో, హీరో చివరికి సైలెంట్ కావడం తప్ప మరేం చేయలేకపోయాడు. కొసమెరుపు ఏమిటంటే, ఈ హీరో ఇప్పటికే ఆ హీరోయిన్‌తో ఒక సినిమా చేశాడు. ఇప్పుడు మరోసారి ఎలాగైనా కలిసి పనిచేయాలని ప్రయత్నిస్తున్నాడట. దీని వెనుక “సమ్‌థింగ్… సమ్‌థింగ్” ఉందని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

3 Replies to “హీరో కోరిక తీరలేదు”

Comments are closed.