పెళ్లి తర్వాత కెరీర్.. అంతా భ్రమ

పెళ్లి తర్వాత కూడా క్రేజ్ కంటిన్యూ చేసే అవకాశం, సౌత్ లో నయనతార లాంటి అతి కొద్దిమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతోంది.

ట్రెండ్ బాగా మారిపోయింది. హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్నారు. దీపిక, కత్రినా, అలియా భట్ లాంటి తారలు పెళ్లి తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత కూడా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఈ స్టేట్ మెంట్ ను అన్ని పరిశ్రమలకు ఆపాదించలేం. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఈ విషయంలో ఇంకా మారలేదు. పెళ్లయిన హీరోయిన్లకు కూడా అవకాశాలొస్తున్నాయని పైకి చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

ఉదాహరణకు కాజల్ నే తీసుకుందాం. మొన్నటివరకు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసింది. దాదాపు దశాబ్దం పాటు ఆమె హవా కొనసాగింది. పెళ్లి తర్వాత కూడా ఆమెకు అవకాశాలొస్తున్నాయని అంతా భావించారు. కానీ కాజల్ మెల్లమెల్లగా ఫేడవుట్ అయిపోతోంది. ఆమెకు పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు.

సమంత పరిస్థితి కూడా ఇదే. ఆమెకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆమె సినిమాలు తగ్గించుకుందా.. లేక ఆమెకు అవకాశాలు రావడం లేదా అనే చర్చను పక్కనపెడితే.. సమంత వెండితెరపై కనిపించి చాన్నాళ్లయింది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లు మాత్రమే చేస్తోంది.

శృతిహాసన్ 40 ఏళ్ల దగ్గరకు వచ్చింది. త్రిష ఆల్రెడీ 40 దాటేసింది. అనుష్క కూడా 40 దాటి మూడేళ్లు అవుతోంది. తమన్నా 35 క్రాస్ చేసింది. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం వల్లనే వీళ్లింకా అంతోఇంతో క్రేజ్ లో ఉన్నారేమో అనిపిస్తోంది.

పెళ్లి తర్వాత కూడా క్రేజ్ కంటిన్యూ చేసే అవకాశం, సౌత్ లో నయనతార లాంటి అతి కొద్దిమంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతోంది. ఈ విషయంలో టాలీవుడ్ చాలా వెనకబడి ఉంది. నిహారిక, లావణ్య త్రిపాఠి, ప్రియమణి, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి పెళ్లైన హీరోయిన్లు సినిమాలు చేస్తున్నారంటే చేస్తున్నారంతే. పెద్ద సినిమాలకు వీళ్లు ఎప్పుడో దూరమయ్యారు.

2 Replies to “పెళ్లి తర్వాత కెరీర్.. అంతా భ్రమ”

Comments are closed.