జంధ్యం ఉన్నవాళ్లంతా బ్రాహ్మణులేనా?

మీరు మనువాదులు కాబట్టి.. పేదల కోసం రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్న వైనం మీకు నచ్చడం లేదన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని సీఎం రేవంత్ రెడ్డి గెలికిన సంగతి తెలిసిందే కదా. ఈయన పుట్టుకతో అగ్ర కులానికి చెందినవాడని, కాని తరువాత బీసీ కులం వాడిగా కన్వర్ట్ అయ్యారని రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ మతమేదో, కులమేదో చెప్పాలని సవాల్ చేశారు.

ఈ సవాల్కు రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వలేదుగాని ఇతర కాంగ్రెసు నాయకులు సమాధానం చెప్పారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడేనని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బల్లగుద్ది మరీ చెప్పాడు. రాహుల్ గాంధీ హిందూ మతానికి చెందినవాడేనని, ఆయన బ్రాహ్మణుడని అన్నాడు. ఆయన జంధ్యం వేసుకోవడం చాలామంది చూసేవుంటారని అన్నాడు.

అయితే జంధ్యం వేసుకున్నవారంతా బ్రాహ్మణులు అవుతారా? హిందూ మతంలో వేరే కులాలకు చెందిన కొందరు జంధ్యాలు వేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ జంధ్యం వేసుకొని తాను బ్రాహ్మణుడినని చెప్పుకున్నాడు. ఒకసారి రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ గాంధీ పుష్కర్ లోని బ్రహ్మ ఆలయానికి వెళ్ళాడు.

అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించిన రాహుల్ పూజారులు అడగ్గా తన కుల, గోత్రాలేమిటో చెప్పారు. తనది కౌల్ బ్రాహ్మణ కులమని, దత్తాత్రేయ గోత్రమని రాహుల్ వెల్లడించాడు. బీజేపీ నాయకుల సవాల్కు కాంగ్రెసు నాయకుడు అద్దంకి దయాకర్ సమాధానం ఇస్తూ కులమత రాజకీయాలు చేసే మీకు రాహుల్‌గాంధీ కులం ఏందో తెలియని దుస్థితిలో ఉండటం సిగ్గుపడాల్సిన విషయం అని విమర్శించారు. రాహుల్‌గాంధీ కులం ‘పండిత్’ అంటే బ్రాహ్మణ కులం.. అని స్పష్టం చేశారు.

మీరు మనువాదులు కాబట్టి.. పేదల కోసం రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్న వైనం మీకు నచ్చడం లేదన్నారు. రాహుల్ కాబోయే ప్రధాని అని ఆ దృష్టితోనే ఆ కుటుంబాన్ని బీజేపీ నాయకులు కించపరుస్తున్నారని ఆరోపించారు. దీనికి బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తూ రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు ఇటలీ దేశస్తురాలు అని మండిపడ్డారు.

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్.. ఆయన మనవడు రాహుల్ జహంగీర్ కావాలి.. కానీ, గాంధీ ఎలా అయ్యారు. ఆయనకు దేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసా?’’అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కులం, మతం గురించి మాట్లాడిన వారిపై కర్నాటకలో కేసులు పెట్టారని, ఇప్పుడు తాను మాట్లాడుతున్నానని, తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడనున్నారు.

మొత్తం మీద కుల గణన చేసిన రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ కులాన్ని గెలకడంతో బీజేపీ, కాంగ్రెసు నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. అయినా ప్రధానిది ఏ కులమైతే ఏంటి? రాహుల్ గాంధీది ఏ కులమైతే ఏంటి? అనవసరంగా గెలుక్కోవడం తప్ప దీనివల్ల ఒరిగేది ఏమైనా ఉందా?

7 Replies to “జంధ్యం ఉన్నవాళ్లంతా బ్రాహ్మణులేనా?”

  1. మరి అలానె నాలుగు గొడల మద్య బైబిల్ చదివేవరు, చర్చి కి వెల్లెవారు, గొడులకి రాకుండా.. గుడి సెట్టెసెవారు… హిందువులు… రెడ్లు అవుతారా చెప్పు GA??

  2. డియర్ వెంకటి ! రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ ఒక పార్శి. ముస్లిం కాదు .

  3. Feroz jahanghir is parsi (zorawtrain) like TATA , godrej , ness wadia etc they are not muslims infact they fought with muslims and left iran in 8th century and settled in Gujarati

Comments are closed.