కేజీఎఫ్.. ఎవరు ఔనన్నా కాదన్నా ఇండియన్ సినిమాలోనే ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇది. ప్రేక్షకుల పైనే కాదు, ఎంతోమంది ఫిలిం మేకర్స్ పై ఇది ప్రభావం చూపించింది. కేజీఎఫ్ ను అనుకరిస్తూ చాలా సినిమాలొచ్చాయి, ఇంకా వస్తున్నాయి.
కానీ పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి దర్శకుడు సైతం ఈ సినిమా మాయలో పడిపోవడం విశేషం. మేకింగ్ లో పృధ్వీరాజ్ కు తనకుంటూ ఓ స్టయిల్ ఉంది. తొలి సినిమా లూసిఫర్ లోనే అది చూపించాడు. కానీ దర్శకుడిగా మూడో సినిమాకు వచ్చేసరికి పూర్తిగా కేజీఎఫ్ మాయలో పడినట్టు కనిపించింది.
ఎంపురాన్ కథ రాసుకునే టైమ్ కు కేజీఎఫ్-2 రిలీజైంది. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్టయింది. అదే ఛాయలు ఎంపురాన్ (లూసిఫర్ 2)లో కనిపించాయి. సినిమాలో స్క్రీన్ ప్లేతో పాటు, అడుగడుగునా వచ్చిన ఎలివేషన్స్ చూసిన ఎవరికైనా కేజీఎఫ్ సినిమా గుర్తుకురావడం ఖాయం.
లూసిఫర్ 3 కూడా ఉందంటూ సినిమా చివర్లో చూపించిన సన్నివేశాలైతే అచ్చం కేజీఎఫ్ సెటప్ ను గుర్తుకుతెచ్చాయి. ఒరిజినాలిటీకి పెట్టింది పేరైన మలయాళం సినిమా నుంచి ఇలా కేజీఎఫ్ ను అనుకరిస్తూ ఎంపురాన్ రావడం ఎంత వరకు కరెక్టో పృధ్వీరాజ్ కే తెలియాలి.
ఇప్పటికే కబ్జా, మైఖేల్, విక్రాంత్ రోణ లాంటి చాలా సినిమాలు కేజీఎఫ్ ను అనుకరిస్తూ వచ్చి చతికిలపడ్డాయి. ఎంపురాన్ ఆ లిస్ట్ లోకి చేరకూడదనే కోరుకుందాం.
పృథ్వీరాజ్ సుకుమారన్ రెండో సినిమా ఏది ?
Bro Daddy
Ok
ఎందుకురా మాకీ కంపురాన్ …
Hi work vundi
Job vundi call me 9019471199