యంగ్ హీరోలు మారాల్సిందే

టాలీవుడ్ మార్పు కోరుకుంటోంది. హీరోలు అంతా ఇది గమనించాలి.

సరైన హీరోయిన్, పాటలు, ఫైట్లు, హుక్ స్టెప్ లు, మంచి పబ్లిసిటీ ఇవి వుంటే చాలు సినిమా బండి లాగేస్తుంది అని అనుకుంటే పొరపాటు అనే చెప్పే రోజులు వచ్చేసాయి. అంతకు మించి కాస్త కథ, మరి కాస్త వైవిధ్యం అనే దినుసులు కూడా కావాలి అని అర్థం అవుతోంది. కొందరు హీరోలు మారారు. కొందరు మారుతున్నా సరిపోవడం లేదు.. మరి కొందరు ఇంకా మారాల్సి వుంది.

నాని లాంటి హీరోలు అందరికన్నా ముందుగా మేల్కొన్నారు. దెబ్బలు తింటే తిన్నాం అని అదే రూట్లో వెళ్లారు. మార్పును ఫలాలు ముందుగా అందుకున్నారు.

అల్లరి నరేష్, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు వైవిధ్యమైన పాత్రలు టేకప్ చేస్తున్నారు కానీ వారికి సరైన పూల్ ఫ్రూఫ్ కథలు దొరకడం కష్టంగా వుంది. కానీ వన్స్ ప్రయత్నం మొదలుపెట్టారు కనుక, ఎప్పటికైనా ఆ దిశగా సెటిల్ అవుతారు.

రామ్, నితిన్ ఇలాంటి వాళ్లు ఇంకా వెనుకబడి వున్నారు. రామ్ ఇంకా తన రొటీన్ మాస్ సినిమాలే అనుకుంటున్నారు. నితిన్ కూడా తనకు అవే నప్పుతాయి అనుకుంటున్నారు. అందుకే సక్సెస్ లు రావడం కష్టంగా వుంది.

సీనియర్ల సంగతి వేరుగా వుంది. వారిది అటు ఇటు కాని పరిస్థితి. అటు మరీ ఎక్స్ ట్రీమ్ కు వెళ్లలేరు. ఇటు అలా అని రొటీన్ సినిమాల మీద వుండలేరు. చిరు, రవితేజ, బాలయ్య ఏదో వీలయినంత ప్రయత్నిస్తున్నారు. బట్ వాళ్లకు ఏమీ అంత సమస్య లేదు. ఎంతో కొరీర్ చూసారు. ఇప్పుడు ఏదో అలా మెల్లగా తొందరపడకుండా చేసుకువెళ్లే సెటిల్డ్ పరిస్థితిలో వున్నారు.

కానీ రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరోల కన్నా ఇంకా చిన్న రేంజ్ హీరోలు వున్నారు. అసలు వీళ్ల సినిమాలకు ఓపెనింగ్ లే పడడం లేదు. సరైన థ్రిల్లర్ జానర్ సినిమాలే వీరికి దిక్కు. కానీ వీళ్లు కూడా మాస్ సినిమాల కేసి చూస్తూ కెరీర్ పాడు చేసుకుంటున్నారు.

టోటల్ గా టాలీవుడ్ మార్పు కోరుకుంటోంది. హీరోలు అంతా ఇది గమనించాలి. ఎవరి లెవెల్ కు అనుగుణంగా వారు మారాలి.

4 Replies to “యంగ్ హీరోలు మారాల్సిందే”

  1. మారిపోతారు.. ఇంకో ఐయుదు ఏళ్ళు పొతే సీనియర్ సిటిజెన్ అయిపోతారు లే

  2. Gopichand’s movie story selection is horrible. I don’t know how producers get ready to do movies with him, almost all producers lost money in his movies.

Comments are closed.