ఆ కుటుంబానికి వైసీపీలో ప్రయారిటీ

జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఆ కుటుంబం రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ వస్తోంది.

వైసీపీ అధినాయకత్వం ఆ కుటుంబం పట్ల ఎంతో అభిమానం చూపిస్తుంది. ఆ కుటుంబం కూడా వైసీపీ హైకమాండ్ తో అత్యంత సన్నిహితంగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో పాలవలస కుటుంబానికి మంచి పేరు ఉంది. అర్ధ శతాబ్దం పైగా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం వారిది.

ఇటీవలే ఆ కుటుంబం పెద్ద దిక్కు మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం మరణించారు. జగన్ ప్రత్యేకంగా హాజరై ఆ కుటుంబాన్ని పరామర్శించారు. మొదట కాంగ్రెస్ లో వైఎస్సార్ విధేయుడిగా ఉన్న రాజశేఖరం వైసీపీ ఏర్పాటు నుంచి అందులోనే ఉంటూ వచ్చారు. ఆయన కుమారుడు కుమార్తె ఇద్దరూ వైసీపీలోనే కీలకంగా ఉన్నారు.

కుమారుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం నుంచి 2019లో మంచి మెజారిటీతో గెలిచారు. ఆమెకు 2014లో శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్ 2019, 2024లో రెండు సార్లు పాతపట్నం టికెట్లు ఇచ్చారు. ఇపుడు ఆమెకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత ఇచ్చేలా వైసీపీ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా సంఘంలో సభ్యురాలిగా నియమించారు.

ఈ కమిటీలో ఏపీ మొత్తంగా కొద్ది మంది సభ్యులనే తీసుకుంటే అందులో ఉత్తరాంధ్ర నుంచి ఆమెకే ప్రాధాన్యత దక్కింది. ఆ విధంగా ఆ కుటుంబం అంటే వైసీపీలో ఎంత కీలకమో మరోసారి అధినాయకత్వం చెప్పినట్లు అయింది అని అంటున్నారు. 2029లోనూ పాతపట్నం టికెట్ పాలవలస కుటుంబానిదే అని అంటున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఆ కుటుంబం రాజకీయంగా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ వస్తోంది. వైసీపీ కూడా ఆమేరకు గుర్తింపు ఇస్తోంది అని అంటున్నారు.

18 Replies to “ఆ కుటుంబానికి వైసీపీలో ప్రయారిటీ”

  1. వైసీపీ లో క్రమశిక్షణా సంఘమా..?

    పార్టీ పెట్టిన 13 ఏళ్లకు గుర్తొచ్చిందా..? ఇప్పుడు ఉన్నట్టుండి క్రమశిక్షణ అవసరం ఏమొచ్చింది..?

    జగన్ రెడ్డి కి ప్రతిపక్ష పదవి లేదు గాని.. పార్టీ లో అందరికీ పదవులిచ్చేస్తున్నట్టు కలరింగ్ మాత్రం భలే ఇస్తాడు..

    ఇప్పుడు ఉన్నట్టుండి “క్రమశిక్షణ” అంటూ పెద్ద పెద్ద పదాలు వాడితే.. పార్టీ లో మిగిలిన ఒకరిద్దరు గాలి ఆడక సతమతమైపోరా..?

    పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందం గా..టీడీపీ లో క్రమశిక్షణ సంఘాన్ని చూసి.. ఎందుకొచ్చిన “క్రమశిక్షణ” మనకు?

    1. ప్రతిపార్టీకి ఏదో ఒక అత్యున్నత నిర్ణాయక కమిటీలు ఉంటాయి.కాంగ్రెస్ కి CWC , బీజేపీ కి పార్లమెంటరీ బోర్డు, కమ్యూనిస్టు, టీడీపీ లకి పోలిట్బ్యూరో , జన సేనకు పార్లమెంటరీ అఫైర్స్ కమిటి (PAC ) . వైసీపీ కి మాత్రం ఇలాటి కమిటీ ఉన్నట్లు నాకు కనిపించలేదు. ఉంటే అదేంటో ఎవరైనా చెప్తారా?

      1. ఉంది, దాని పేరు “ఆ ఒక్కటీ అడక్కు”..! అందులో 50మంది సలహాదారులు ఒక్క విషయం గురించి చెప్తే, అదే విషయాన్ని ఆ ఒక్కడు(ఎవడో తెలుసుగా..!) చెప్తున్నట్లు ఉన్న(edit చేసిన) వీడియోని వదులుతారు. వాడు చెప్పిన ఆ ఒక్క విషయం గురించి, ఇంక ఏ ఒక్కడూ అడగటానికి ఉండదు/వీల్లేదు. అందుకే ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నారు.😜😜

        1. నేనెప్పుడూ ఆ పేరు వినలేదు . దీని లైఫ్ టైంలో కనీసం ఇక్కసారైనా సమావేశం అయ్యారా?

  2. క్రమశిక్షణా సంగం, అదీ వైసీపీ లో, ఒరేయ్ రాయటానికి నీకన్నా సిగ్గు ఉండోద్దరా…

Comments are closed.