ఎట్టకేలకు నిలబడిన నాగవంశీ

ప్రతిసారి నాగవంశీ సినిమాకు గట్టిపోటీ ఎదురవుతూనే ఉంది. ఈసారి మాత్రం మ్యాడ్ స్క్వేర్ తో నాగవంశీ నిలబడినట్టు కనిపిస్తోంది.

రీసెంట్ గా ‘గ్రేట్ ఆంధ్ర‘కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు పోటీలో నిలబడలేకపోతున్నాయనే ప్రశ్నపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగవంశీ. ప్రతిసారి తన సినిమాలకు గట్టి పోటీ ఎదురవుతోందని, ఈ పోటీ తనకు పీడకలగా మారిందని చెప్పుకొచ్చాడు.

మ్యాడ్ స్క్వేర్ సినిమాను కూడా గట్టిపోటీ మధ్య రిలీజ్ చేశాడు నాగవంశీ. ఓవైపు ఎంపురాన్, మరోవైపు రాబిన్ హుడ్ సినిమాలున్నాయి. అయినప్పటికీ ధైర్యం చేసి, మ్యాడ్ స్క్వేర్ అనే చిన్న సినిమాను విడుదల చేశాడు. అయితే ఈసారి నాగవంశీ నిలబడ్డాడు.

ఓపెనింగ్స్ నుంచే మ్యాడ్ స్క్వేర్ సినిమా ఆధిపత్యం చలాయించింది. అటు రాబిన్ హుడ్ కు నెగెటివ్ రిమార్క్స్ రావడంతో ఈరోజు నుంచి ఈ సినిమా ఎడ్జ్ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

గతంలో గుంటూరుకారం రిలీజ్ చేస్తే హనుమాన్ అడ్డుగా నిలబడింది. లక్కీ భాస్కర్ రిలీజ్ టైమ్ లో అమరన్, క సినిమాలు పోటీగా నిలిచాయి. సంక్రాంతికి డాకు మహారాజ్ కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తే ఊహించని విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా డామినేట్ చేసింది.

ఇలా ప్రతిసారి నాగవంశీ సినిమాకు గట్టిపోటీ ఎదురవుతూనే ఉంది. ఈసారి మాత్రం మ్యాడ్ స్క్వేర్ తో నాగవంశీ నిలబడినట్టు కనిపిస్తోంది.

One Reply to “ఎట్టకేలకు నిలబడిన నాగవంశీ”

Comments are closed.